Sunday, September 13, 2009

కాంగ్రెస్ (వై.ఎస్.) పేరిట కొత్త పార్టి ఏర్పాటు

గౌ. జగన్మోహన్ రెడ్డి గారికి,
అయ్యా ! ఇప్పటికే లక్షలాది సంతాప సందేశాలతో విసిగి పోయుంటారు. ఈ విపత్కర రాజ కీయ పరిస్థితిలో మరెవ్వరూ మీకివ్వలేని సలహాను మీకివ్వాలని ఉద్దేశించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నా లాంటి వీరాభిమానులు లక్షల్లో ఉంటాఅరు. వారు మిమ్మల్ని స్వయంగా కలిసే వీలు లేక ఉత్తరాలు, మెయిల్స్ పంపి ఉండవచ్చును. వాటిని తక్షణమే పరిశీలించి ఒకటి రెండు ముక్కల్లోనన్నా సమాధానం పంపే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొండి. ( ఇది చివరి 6 నెలలు మినహా ఎన్.తి.ఆర్ కు ఉండేది. ఇది నా అనుభవం అయితే ఇటువంటి యంత్రాంగం మీ నాన్న గారికి కూడ లేదు . ఇదీ నా అనుభవమే)
నా ఉత్తరంలో పేర్కొంటున్న ప్రతి చిన్న విష్యం కూడ అక్షర సత్యం. వీటికి తిరుగులేని స్పష్ఠమైన ఆధారాలున్నాయి
స్స్వాటిని స్కాన్ చేసి సైట్ లో పెట్టడం, లేదా జిరాక్సులు తీసి మీకు పంపడం ఏదో ఎదురు చూసి చేసినట్టుంటుంది. అందుకే అలా చెయ్యడం లేదు. ఒక వేళ ఈ ఉత్తరం మీ దౄష్ఠికొచ్చి ఆ ఆధారాలను పంప కోరితే సంతోషంగా పంపుతాను. ఇంతకీ నేనిచ్చే సలహా ఏమంటే ..నో నో.. తొలూత మీ నన్న గారికి నాకు ఉన్న అనుభందాన్ని వివరించి ఆ తరువాత నా సలహాను ఇస్తేనే నా చిత్త శుద్ది మీకర్థమవుతుంది సుమండి.
నిజానికి నేను ఎన్.టి.ఆర్ అభిమానిని.కాని కాని ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలను స్వాయాన ఎన్.టి.ఆర్ అల్లుడైన చంద్రబాబే తుంగలో తొక్కినా వాటిని అమలు చేసారు నాన్న గారు. అందుకు ఆయనకు జోహార్. నేను నా ఇడీల్ హి గా భావించి మురిసి పోయే ఎన్.టి.ఆర్ ను వెన్ను పోటుతో పదవీ చ్యుతుడ్ని చేసి వికట్టహాసం చేసిన చంద్ర బాబు ఇంద్రజాలం పై మంత్ర జలం చల్లి రాజ్యాధికారాన్ని కైవశం చేసుకున్నప్పుడే ఎన్.టి.ఆర్ అభిమానినైన నా మనస్సులో నాన్న గారికి ఒక చోటు ఏర్పడి పోయింది. ప్రతి క్షణం ఎన్.టి.ఆర్ ను తలపిస్తూ వచ్చిన నాన్న గారు ఒక దశలో ఎన్.టి.ఆర్ నే మరిపించే స్థాయికెదిగారు.
2004 ఎన్నికల సమయంలో “తెలుగుదేశం పార్టిని చిత్తుగా ఓడించండి “అంటూ 10 వేల కరపత్రాలు ముద్రించి నేనొక్కడ్నే పరోక్షంగా వై.ఎస్. గెలుపుకు కౄషి చేసాను. ఈ చర్య వెనుక చంద్రబాబు పై పగ 60 శాతం అయితే నాన్న గారి పాద యాత్ర కారణంగా ఏర్పడిన అభిమానం 40 శాతం . చంద్రబాబు పై కశికి కారణం లేక పోలేదు.
నిరుధ్యోగినైన నేను 10 కోట్ల మందికి ఉధ్యోగవకాశం కల్పించే పథకం రూపొందించాను. రెక్కాడనిదే డొక్కాడని జీవితాన్ని ఓవర్ కం చేసి దేశాన్ని సంపన్న దేశంగా మార్చాలని ఒక పథకం రూపొందించాను. అదే ఆపరేషన్ ఇండియా 2000. ఈ పథకం ప్రతులను 1997 నవంబరు నుండి, 2002 ఏప్రల్ 22 దాక చంద్రబాబుకు పంపుతూ వచ్చాను.
అప్పట్లో ఆయన గారి కళ్ళు నెత్తి మీద ఉండేవి. వారు అలా నిర్లక్ష్యం చెయ్యడంతో 2002 ఏప్రల్,22 న పది రూ. మనియార్డరు పంపాను. మీది యూజర్ చార్జీల ప్రభుత్వం కదా , ప్రత్యుత్తరం పంపటానికి సైతం యూజర్ చార్జి నిర్ణయించారేమో, బహుసా పోస్టల్ స్టాంపులకు సైతం ఖజాణాలో డబ్బుల్లేవేమో కాబట్టి తిరుగు టపా ఖర్చుల నిమిత్తం ఈ ఎం.ఓ స్వీకరించి సమాధానం ఇవ్వండని కోరాను. ఎం.ఓ. స్వీకరించ బడింది కాని సమాదానం రాలేదు. నేను జిల్లా వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేసాను. అందాక మొద్దు నిద్రలో ఉన్న బాబు మేల్కొని కేవలం ఫోరంలో కేసును నిర్వీర్యం చెయ్యాలని " మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" ప్రత్యుత్తరం వ్రాయించారు. సి.ఎం. పేషి నిర్వాకాన్ని పత్రికలకెక్కించానని జిల్లా అధికారులకు రహ్స్య సూచనలిచ్చి నానా హింసలు పెట్టించాడు. చంద్ర బాబు పై నాకున్న కశికి కారణం ఇది.

వై.ఎస్.పై అభిమానం:
ఇదివరకే పేర్కొన్న ఆపరేషన్ ఇండియా 2000 పథకమ్యొక్క ముఖ్య అంశం నదుల అనుసంథానం ద్వారా సాగు నీటి కొరతను రూపు మాపడం. వ్యవసాయ రంగం పై ఆధార పడి బ్రతుకుతున్న 70 శాతం ప్రజల జీవితాల్లో వెలుగును నింపడం. డా. వై.ఎస్. పాద యాత్ర ద్వారా పెండింగ్ ప్రాజెక్టులపై ఉధ్యమించడం, పరిపాలన చేపట్టగానే జల యజ్ఞానికి పూనుకోవడం , దాంతో పాటు తక్షణ అప్రిష్కారంగా ఉచిత విద్యుత్ అందిస్తూ, మరో ప్రక్క ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో నాకు వై.ఎస్.పట్ల అభిమానం ఇరుముడించింది.

2009 ఎన్నికలు:
అప్పటికే యాడ్ పేజస్ తరహాలో నదుపుతున్న పక్ష పత్రిక ద్వారా 2008 జనవరి 26 నుండి డా.వై.ఎస్. అభివౄద్ది & సంక్షేమ పథకాలపై విస్త్రుత ప్రచారం మొదలు పెట్టాను.
స్థానికంగా ఉన్న పార్టి వర్గాలతో సత్సంబంధాలు పెంచుకున్నాను. 2008 నవంబరులో తెలుగు బ్లాగు ఒకటి ప్రారంభించాను. దాని ఈ రోజు వరకు దాదాపు 20000 మంది సందర్శించారు.
ప్రత్యక్ష ప్రచారం:
2009 ఏప్రల్ 7 నుండి ఏప్రల్ 21 సాయంత్రం దాక కాంగ్రెస్ పార్టి ప్రచార వాహనమెక్కి ప్రత్యక్ష ప్రచారం నిర్వహించాను. స్థానిక అభ్యర్ధి విజయానికి ఉడతా పాటి సాయం అందించాను.
వై.ఎస్.లో ఎన్.టి.ఆరును చూసుకుందామన్న నా ప్రచారం భాగానే పారింది. తెలుగు దేశం పార్టి అభ్యర్ధి స్వంత మండలమైన గుడిపాల మండలంలోనే కాంగ్రెస్ పార్టి అభ్యర్ధికి అధిక మెజారిటి లభించింది.

పుస్తక ముద్రణ:
ఇదే కాక స్థానిక అభ్యర్ధి పై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు మొదట 16 పేజీలతో, ఆపై 32 పేజీలతో ఒక పుస్తకం ముద్రణ చేసి ఉచితంగా పంచాను.
వై.ఎస్.కుమారుడైన తమకు సహజ సిద్దంగానే ఆయన లక్షణాలు ఉండవచ్చు. కాని ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత పొందటానికి ముందే పుట్టిన వారు కాబట్టి మీకు క్రింది సలహాను ఇవ్వడం నా భాధ్యతగా భావిస్తున్నాను.

డా.వై.ఎస్. పై నాకున్న అభిమానం, చంద్రా బాబు పై నాకున్న వ్యతిరేకతను ముదుగా చాటాలనే ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో మీరు ఆలశ్యం చేసే ప్రతి సెకండు సి.ఎం.కుర్చీకి మీకూ ఉన్న దూరాన్ని పెంచుతుందని హెష్చరిస్తున్నాను. మీరు చెయ్యవలసిందల్ల ఒకటే.

తక్షణం సె.ఎల్.పి.సమావేశం ఏర్పాటు చెయ్యడం. మిమ్మల్ని నేతగా ఎన్నుకునేలా చూడటం, వారందరితో గవర్నరును కలవడం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరడం. కాంగ్రెస్ (వై.ఎస్.) పేరిట కొత్త పార్టి ఏర్పాటు చెయ్యడం.


ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్

No comments:

Post a Comment