Wednesday, September 16, 2009

వ్రుషభ రాశి మిత్రులారా !

వ్రుషభ రాశి మిత్రులారా !
రాశి చక్రంలో రెండవరాశి దనం, వాక్కు,కుటుంభం నేత్ర స్థానాలను సూచించే సౄషభ రాశి మీ జన్మ రాశి అయినందున మీకు డబ్బంటే ఎంతో గౌరవం. మీ స్నేహాలకు, శతౄత్వాలకు డబ్బే కారణమై ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న తత్వం మీలో ఉంటుంది. దానిని పరుల వద్దనుండి కూడ ఎదురుచూడటంతో కొన్ని సమస్యలొస్తాయి. అలాగే పిచ్చా పాటి కబుర్లన్నా ఇష్టమే.వికట వినోద పరిహాస ప్రసంగ ప్రియులు. మీరు ఏమాత్రం ప్రయత్నించ కున్నా మంచి సర్కిల్ ఏర్పడుతుంది. మీకు కుటుంభ వ్యవస్థంటే ఎంతో ప్రీతి. అయితే విధి వ్రాత వక్రించినప్పుడు మీరు ప్రాణ సమానంగా భావించేవే దూరమై మిమ్మల్ని క్షోభ పెడ్తాయి. ఇక శని మహాత్ముని గురించి ఆలోచిస్తే ఈయన మీకు 9,10వ స్థానాలకు అధిపతి. అంటే మీకు ఆస్తి, పొదుపు,దూరప్రాయణాల ద్వారా లాభం కల్పించవలసింది శనియే. అలాగే మీకు వౄత్తి వ్యాపారాలు కల్పించవలసింది ఈయనే. అందుకేనేమో పై విష్యాల్లో కాస్త ఆలస్యం తప్పని సరి, ఇతరుల మనస్సులను నొప్పించి గాని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని దుస్థితి. ఇట్టి శని మీకు గతంలో 4 న ఉన్నాడు. తల్లి ,ఇల్లు,విద్యా వాహణాదుల విషయంలో క్షోభ పెట్టిన శని ఈ విడత 5కు రావడం ఒక విదంగా మేలే. 9 అంటే ఆస్తి, ఐదు అంటే అద్రుష్ఠం. పిల్లల విష్యంలో ఇది కొంత రివర్స్ గేర్ వేసినా ఆస్తి,ఆదాయం,అదౄష్ఠం విషయాల్లో మంచే చేస్తుంది. అలాగే చేసే వౄత్తి,వ్యాపారాల్లోను అదౄష్ఠం వరిస్తుంది. అయితే అవి చేతికి మట్టి,జిడ్డు పుయ్యించేవిగా ఉండవచ్చును. అలాగే దుర్వాసన, నలుపు రంగు గల వస్తువులు కూడ లాభిస్తాయి

No comments:

Post a Comment