Tuesday, September 15, 2009

మేష రాశి మిత్రులారా !

ఈ లోకంలో చురుగ్గా పని చేసి మరి చెడ్డ పేరు తెచ్చుకునే వారు మీరొకరే ! ఇందుకు కారణం లేక పోలేదు. రాశి చక్రంలో మీది మొదటి రాశి అయినందున. నేనంటే నేనేనని ముందుకు దూకుతారు. ఈ లోకం చాలా తెలివైంది మిమ్మల్ని ఇట్టే వాడేసుకుని మూలన పడేస్తుంది. అదీకాక మీ రాశి నాథుడు కుజుడు అయినందున మీలో శక్తి ఉబుకుతూ ఉంటుంది. మీరు ఊరికే ఉండలేరు. జీవితంలో పనిచెయ్యడం ఎంత ముఖ్యమో కొన్ని సమ్యాల్లో ఏమి చెయ్యకుండా ఉండటం కూడ అంతే ముఖ్యం. "పోదాం పోదాం పై పైకి" అన్నట్టు ఇంకా ఇంకా అంటూ పరుగులు తీస్తారు. మీరు కేవలం ఒక సైనికులు మాత్రమే. కేవలం మీకు ఒక కమేండరో , సలహాదారుడే ఉంటే గాని విజయం సంభవం. పొరభాటుగా విజయం లభించినా దాని ఫలితం మీకు అందక పోతుంది.

పోనిలెండి గతంలో బుద్ది,పుత్ర,పూర్వ పుణ్యస్థానమ్యందున్న శని సెప్.26న శత్రు,రోగ రుణస్థానానికి రావడం మంచి మలుపే. దీంతో గత 3 సం.లుగా ఉన్న అశాంతి,అవమానాలు,తప్పుడు ఆలోచనలు దూరమవుతాయి. పిల్లలు మీకు ఆకర్షితులవుతారు. మీకు న్యాయంగా లభించ వలసిన గుర్తింపు లభిస్తుంది. అదౄష్ఠం వరిస్తుంది. అలాగే గతంలో మీ అశాంతి వలన చెడిన మీ ఆరోగ్యం కుదట పడుతుంది. గతంలో ఎవరైతే మీ కంట నీళ్ళు తెప్పించారో వారి కంట నెత్తురు కారుతుంది. చూసి తరించండి. రుణాలు తీరుతాయి. మీకు రావల్సినవి వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమవుతాయి. అయితే ఈ రెండున్నర సం.కాలంలో " నేను అనుకున్నదే కరెక్ట్. ప్రతి ఒక్కరు నా మాటే వినాలి. ఎవరు నన్ను ప్రశ్నించ కూడదనే తత్వం మీలో పెరుగుతుంది. ఇతరులను నిర్లక్ష్యం చేసే గుణం కూడ వస్తుంది. దీంతో మీరు జన భాహుళ్యానికి దూరమయ్యే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్త.

శని మీకు 10, 11 స్థానాలకు అధిపతి కాబట్టి వౄత్తి,వ్యాపారాలు నిమిత్తం కొంత మెరకు అప్పు చెయ్యవలసి వస్తుంది. పోటి ఉంటుంది. పని వత్తిడి పెరుగ వచ్చు. అలాగే మీకు అక్క,అన్నలతో (ఎవరన్న ఉంటే) ఒక వ్యవహారం వస్తుంది. అయినా మీదే అంతిమ విజయం. పైగా మీ లాభం కొంత వివాదాలతోనే మీ గల్లా పెట్టెకు చేరుతుంది.

No comments:

Post a Comment