Thursday, September 24, 2009

సి.కె.విజయంతో ఆగిన భూ ఆక్రమణ

దినపత్రికల్లో భూ ఆక్రమణల గురించిన వార్తలు చదువుతుంటారు. కాని అవి ఎలా జరుగుతాయో వాటి వెనుక అసలు కథేమిటో పత్రికల్లో రావు. మచ్చుకు ఒక భూ ఆక్రమణ ఉదంతాన్ని ఈ టపాలో వివరిస్తాను.

చిత్తూరు పట్టణం ప్రకాశం హైరోడ్డులోని ఆంథ్రా బ్యాంకును ఆనుకుని 75 సెంట్ల స్థలం ఉంది (సర్వే నెం.466) ఈ స్థలం 1931 దాకా అదే ప్రాంతానికి చెందిన పూర్వికులైన యాధవులకు చెందినది. 1931 లో పై భూమిలో దక్షిణ భాగమ్యందున్న 37.5 సెంట్ల భూమిని పూర్వికులైన ముగ్గురు విక్రయించారు. తమకున్న భాగంలో సెరి సగం ప్రోగు చేసి అలా అమ్మారు. సతరు దక్షిణ భాగంలోని భూమి అక్కడనుండి పలు చేతులు మారింది. 1980 లో శంఖరరెడ్డి అనే న్యాయవాది చేతికొచ్చింది. అతను తాను కొన్న భూభాగాంలోని చిన్నా చితకా భాగాలను అప్పుడప్పుడు విక్రయిస్తూ వచ్చాడు. అన్నీ రెజిస్ట్రార్ కార్యాలయంలో పక్కాగా రెజిస్టర్ అయ్యున్నాఇ.

అయితే అతను తాను విక్రయించిన భూభాగాలను తన భాగంలో నుండి తగ్గించుకోక తనదింకా 37.5 సెంట్లు అలానే ఉన్నట్టుగా సతరు సర్వే నెంబరులో ఉత్తరభాగాన ఉన్న, తనకు ఏ మాత్రం అధికారంలేని భూభాగంలోకి చొచ్చుకొచ్చాడు. ఆ భాగాంలోని గుండ్లను పగులకొట్టడం, భూమిని చదను చెయ్యడం చేస్తూ వచ్చాడు. ప్రతిఘ్టన ఎదురైనప్పుడు ఆపెయ్యడం , మళ్ళీ పని మొదలుపెట్టడం చేస్తూ వచ్చాదుఆక్రమణకు గురైన స్థలం తాలూకు మూడు కుటుంభాల్లో ఒకరి పత్రంలో సర్వే నెంబరు తప్పుంది. అయితే చెక్ బంధి పాడు కరెక్టుగా ఉన్నాయి. ఆ తప్పును సరి దిద్దుకుని పోరాడే ఓపిక, శక్తి ఆ కుటుంభానికి లేదు. మరో కుటుంభం ఒక మాజి డైరి ఉధ్యోగిది. అతను కోర్టుకెళ్ళాడు. ఎవరో అతి తెలివి లాయరు ఇచ్చిన సలహా మెరకు శంఖర రెడ్డికి చెందిన స్థల భాగాన్ని తనదంటూ ధావా వేసాడు. అప్పుడు శంఖర రెడ్డి తన స్థలం ఇదని , దానికి సంభంధించిన డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పిస్తాడని సతరు లాయర్ వాధన. కాని ఈ ప్లాన్ బెడిసి కొట్టింది. వీరు తొలూత స్టే తెచ్చుకున్నప్పటికి శంఖర రెడ్డి స్టేను వెక్కేట్ చెయ్యించుకుని. తనదే న్యాయమ్ని, కోర్టే తీర్పించిందని తప్పుడు ప్రచారం చెయ్యించుకున్నాడు. మరో కుటుంభం వెల్డింగ్ షాపు లో పని చేసే సుదర్శనుకు చెందింది . ఇతను నన్నాశ్రయించాడు. నేను ఒక జర్నలిస్టుగా పోలీసు వారికి, వారి సలహా మెరకు ఆర్.ది.ఓ గారికి ఈ సంగతి వివరించాను. ఆర్.డి.ఓ పాపం మంచతను వెంటని సర్వే చ్య్యించమని ఎం.ఆర్.ఓ కు ఆదేశాలిచ్చారు. సర్వే జరిగింది. అయితే శంఖరరెడ్డి సర్వేయరును మేనేజ్ చెయ్యగలిగాడు. సర్వేయరు తాను చేసిన సర్వే తాలూకు రిపోర్టు ఇవ్వక సతాయించడం మొదలు పెట్టాడు.

నేను సమాచార హక్కు చట్టం, వినియోగ ధారుల చట్టాలక్రింద ఎం.ఆర్.ఓ కు నోటీసు జారి చేసాను. ఎం.ఆర్.ఓ ఒళ్ళు మండి సర్వేయరు బదిలీకి రంగం సిద్దం చేసి బదిలీ చెయ్యించారు కూడ కాని సం. గదుస్తున్నా సర్వే రిపోర్టు మాత్రం అందలేదు.

ఇంతలో సతరు శంఖర రెడ్డి ఒక ఉయ్వనేతను ఆశ్రయించాడు. అతను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి ఎం.ఎల్.ఏ టిక్కెట్టుకు ప్రయత్నిచాడు కూడ. అతనికి టికెట్ రాక పోవడం, సి.కె.బాబుకే టిక్కెట్ దక్కడం ద్వారా ఆక్రమణ ఆగింది లేకుంటే ఈ పాటికి ఆక్రమిత భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ వెలిసి ఉండేది.

No comments:

Post a Comment