Wednesday, September 23, 2009

శని పట్టడానికి ముందు:

శని పట్టడానికి ముందు:
తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును

1 comment:

  1. మంచి సమాచారం అందించారు. ధన్యవాదములు.

    ReplyDelete