Sunday, September 6, 2009

కోడి గొంతు నొక్కి

అవును కోడి గొంతు నొక్కి తొలి పొద్దునాపాలని కొందరు చూడటం హాస్యా స్పదం. నాదు ఎడితర్లకు వంగి వంగి దండాలు పెట్టి రచనలు ప్రచురింప చేసుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు సామాన్య పాఠకుని ద్రుష్ఠితో పాటు రైటర్ కం రీడర్స్ ద్రుష్ఠి ఇంటర్నెట్ వైపుకు మళ్ళింది. దీంతీ ప్రింట్ మీడియా గోవిందా గోవిందా.

అందుకని బ్లాగ్ ప్రపంచమంతట స్వేచ్చ, స్వాతంత్ర్యాలు వెలిగి పోతున్నాయా అంటే లేదు సుమా ! పోని ఎలాగో నన్నో కొత్త శిఖరానికి చేర్చేరు. అవును బ్లాగు వ్రాసుకోవడానికి చోటిస్తే , జెల్లడ ,కూడలి వంటివి నా రచనలపై నిషేదం విధించాయి. అయితేనేమి ?

తమిళ బ్లాగ్ ప్రపంచం నన్ను తంతే బ్లాగులోకంలో పడ్డాను. బ్లాగు ప్రపంచం తంతే మళ్ళీ తమిళ బ్లాగ్ ప్రపంచం మీదే పడ్డాను. ఈరోజు నా కవిదై07 బ్లాగు 22 వ ర్యేంకులో ఉంది

ఇప్పుడు బ్లాగు మీద కూడ ద్రుష్ఠి పెట్టాలనుకున్నా .. వస్తున్నా !

No comments:

Post a Comment