గమనిక:
గతంలో నేను వ్రాసిన టపా పై మితృలు రహ్మత్తుల్లా గారి స్పందనకు ప్రతిస్పందనగా ఈ టపా పోస్ట్ చేసాను. మీ అభిప్రాయాలు తెలపండి.
రహ్మత్తుల్లా గారూ,
తొలూత మీ స్పందనకు కృతజ్నతలు. ఇక మీ కమెంట్ పై నా స్పందనకు వస్తున్నాను
//తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్//
ఇది నిజంగా నాకో వార్తే . ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. కాని ఎన్.టి.ఆర్ మొండిగటం. ఆయన ఈ పని చేసాడంటే నమ్మలేకున్నాను
//.అవతలి వ్యక్తి సహించడు అని తెలిసినప్పుడు మరో మార్గం వెతుక్కోవటం మంచిది//
మహాత్ముడు అవలంభించిన అహింశా మార్గాన్ని కూడ కొందరు సహించ లేక పోయారు. అందుకని మహాత్ముడు కూడ మరో మార్గం వెతుక్కుని ఉంటే స్వాతంత్ర్యం వచ్చేదా సచ్చేదా?
//.ఇలాంటి పరిస్థితిలో//
జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మావోలు పెట్రేగి పోతున్నారా? 144 అమల్లో ఉందా? షూట్ అట్ సైట్ అమల్లో ఉందా? ఏమండి కథలు చెబుతున్నారు. కే.సి.ఆర్, టి,ఆర్.ఎస్ లకు వై.ఎస్. ఎప్పుడో కు.ని ఆపరేషన్ చెయ్యించారు. ఇక అక్కడి ప్రజల మనో భావం అంటారా? అక్కడి మనోభావం విభజనకు అనుకూలంగా ఉండి ఉంటే కే.సి.ఆర్ ని తెలంగాణా కావాలో వద్దో ఓటింగ్ నిర్వహించమని డిమాండ్ చెయ్యమనండి. నేను ఒక విలేకరిగా ఎన్నో దర్నాలు, నిరసనలు, దగ్గరాగా ఉండి చూసినవాడ్ని, ఈ కార్యక్రమాలు చూసి సామాన్య జనం ఏమనుకుంటారో? ఈ రాజకీయ నాయకులు జనాన్ని ఎలా తోలుకొస్తారో కూడా నాకు తెలుసు
//దగ్గరకుపోయి ఓదార్చే బదులు//
రాజ్యాంగంతో పని లేదా అండి. రాజ్యాంగం ఎవరన్నా ఎక్కడన్నా స్వేచ్చగా తిరగొచ్చని చెబుతూంది. వాక్ స్వాతంత్ర్యం ఉందని చెబుతూంది. ఒక మహా నేత కుమారుడికే అక్కరకు రాని రాజ్యాంగ సూత్రాలు ఉత్తుత్తే కాగితాల మీద మాత్రం ఎందుకండి. కే.సి.ఆర్ కాంగ్రెస్ లో చేరీ పోతే రాజ్యాంగ సవరణ చేసి ఆ రెండు హక్కులకు మంగళం పాడమనండి
//మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.//
ఎంత గొప్ప సలహా ఇచ్చారండి. ఏం అక్కడనుండి వారి ఇళ్ళల్లో నుండి ఒక భిక్షా పాత్ర తెప్పించి అందులో నోట్ల కట్త వేసి కొరియర్ చేసినా సరిపోతుంది గా.. ఇక్కడ డబ్బు కాదండి ముఖ్యం. ఆత్మీయత,ఆప్యాయత్త నిండిన స్పర్శ, ఓదార్పులే ముఖ్యం
//ఇక జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.//
నాటి అక్బర్ చక్రవర్తి దేశాన్ని పర్కానాలుగా విభజిస్తే ఎన్.టి.ఆర్ మండలాలుగా విభజించి పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజలకు దగ్గరగా తెచ్చారు. జోనల్ ఆఫీసులు ఏర్పడాలని డిమాండ్ చెయ్యండి. మేము సైతమ్ మీతో కలిసి పోరాడతాం
//వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు//
సమైఖ్య రాష్ఠ్ర్రంగా ఉండడం వలన ఇలాంటి నష్ఠాలు వందల కొలది ఉన్నా లెక్క చెయ్యక సమైఖ్య వాదులు సమైఖ్యవాదాన్ని వినిపిస్తున్నారు. మరి కేసిఆర్ అండ్ కో.. తాను సి.ఎం. , తన బావమరది హోం, తన కూతురు శిశు మహిళా సంక్షేమ శాఖా మంత్రులు కావాలని ఊళ్ళో బిడ్డలను భావిలో త్రోసి లోతు చూస్తున్నాడు
//.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాల ఏర్పాటు కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.//
ఇవన్ని సహేతుకమే. అంగీకరిస్తున్నాను
//యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది.//
మంచికాలం కాకినాడ పాక్ బార్డరులో లేదు. ఉండి ఉంటే లాహూర్ ను ఇండియాతో కలపమని తీర్మానించి ఉంటుంది. ఇవన్ని అహేతుకం. హిస్టీరికల్.
//అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.//
గురువు గారూ.. దేశం చాలా క్లీష్ఠ పరిస్థితిలో ఉందండి. ఒక సిని డైరక్టర్ ఆర్థక ఇబ్బందులతో దొంగతనానికి పాల్పడి కాళ్ళు విరక్కొట్టుకునే రోజులండి.. కాస్త సహేతుకంగా ఆలోచించండి. అసలైన సమస్యలను పట్తించుకొండి
గమనిక:
గతంలో నేను వ్రాసిన టపా పై రహ్మత్తుల్లా స్పందనకు ప్రతిస్పందనగా ఈ టపా పోస్ట్ చేసాను
No comments:
Post a Comment