Tuesday, April 13, 2010

2010 లో మీ భవిష్యత్

సాధారణంగా సం. ఫలితాలు చెప్పినప్పుడు శని,గురు,రాహు, కేతువులను బట్టి ఫలితాలు చెబుతుంటారు. ఇది ఒక విదంగా తర్క సమ్మతమే. పై గ్రహాలు ఒక్కో రాశిలో సం.లు తరబడి ఉండి ఫలితాలిస్తుంటారు. కాని వీరికన్నా భలవంతుడు,ఫల వంతుడు కుజుడు. అందుకే నేను కుజ గ్రహ సంచారాన్ని పట్టి ఫలితాలు చెప్ప దలచాను.

కుజ గ్రహం యొక్క విశిష్ఠత:
జాతకాలు చూచు వారు తక్కిన గ్రహాల స్థితి  బాగా లేక పోతే ఆ గ్రహం భాగాలేదు,ఈ గ్రహం బాగా లేదు అంటారు. కాని  ఒక్క కుజ గ్రహ స్థితి భాగా లెకుంటే మాత్రం "అమ్మో ! ఇది దోష జాతకమని ప్రక్కన పెడతారు

ఎందుకంటే ఇతర గ్రహాలు భాగాలేకుంటే వారికి సంభందించిన జబ్బులే వస్తాయి. ఫలానా గ్రహం భాగాలేదు. ఫలానా జబ్బొస్తుందని చెప్పవచ్చు. కాని కుజ గ్రహం రక్తానికి,రక్తంలోని తెల్లకణాలను తయారు చేసే ఎముకల్లోని బోన్ మ్యేరోకి అధిపతి. తెల్లకణాల గురించి తెలుసుగా ? మనిషికి వ్యాధి నిరోధక శక్తినిచ్చే గ్రహం కుజుడు. అట్టి కుజుడు జాతకంలో భాగా లేకుంటే బోన్ మ్యేరో దెబ్బ తింటుంది. అది తయారు చేసే తెల్లకణాల సంఖ్య తగ్గి పోతుంది.వ్యాధి నిరోధక శక్తి పడి పోతుంది.అప్పుడేమవుతుంది ? ఏ జబ్బన్నా వచ్చే అవకాశం కలుగుతుంది.

ఇదో ఎత్తైతే కుజుడు కోపానికి కారకుడు. కోపం వస్తే ఎంతటి గుణవంతుడైనా గుణ హీనుడవుతాడు, ఎంతటి బుద్దిమంతుడికన్నా బుద్ది ప్రకోపిస్తుంది. దాని పర్యావసనం ఎలా ఉంటుందో మీరే ఊహించుకొండి

మరో కోణం కూడ ఉంది. కుజగ్రహన్ని గ్రహాల సైన్యాధిపతిగా పేర్కొంటారు.రాజు ఎక్కడో మందు కొట్టి పడుకుని ఉన్నా సైన్యాన్ని నడిపేది సైన్యాధిపతియే. అట్టి సైన్యాధిపతియొక్క ఆజ్న లేనిదే సైన్యం (ఇతర గ్రహాలు) కదులుతుందా? కదలదు.

అందుకే జాతకంలో కుజునికి వెనుక ఉన్న గ్రహాలను గ్రహ యుద్దంలో ఓడి పోయిన గ్రహాలుగా ,శక్తి హీన గ్రహాలుగా పరిగణిస్తారు.

మనిషికి దైర్య,సాహసాలను ఇచ్చే గ్రహం కుజుడు. ఇతను ఒక రాశిలో సంచరించే కాలం దాదాపుగా 45 రోజులే అయినప్పటికి ఆ 45 రోజుల్లో అధ్భుతాన్ని సృష్ఠిస్తాడు. చిత్తూరు.ఎం.ఎల్.ఏ సి.కె.బాబు మూడవ పర్యాయం పోటీలో ఉన్నప్పుడు అతని జన్మ రాశి అయిన మకరానికి ఒక్క కుజుడు తప్పా అన్ని గ్రహాలు ప్రతికూలమే. సి.కె.పై పోటికి దిగిన అభ్యర్థి రాశి సింహం.ఒక్క కుజ గ్రహం మినహా అన్ని గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయి. గ్రహస్థితి ప్రభావం కారణంగా నాటి ప్రభుత్వం సి.కె.పై,సి.కె.అనుచర గణాల పై ఎన లేని ఆంక్షలు విధించింది.  షేడో పార్టీలంటూ,ఎస్కార్ట్ అంటూ సి.కె.వెనుక బలగాలను మొహరింప చేసేరు.కనీశం ఫోలింగ్ బూతుల్లో పోలింగ సరళి గురించి తన అనుచరులను వాకబు చేద్దామన్నా కుదరని పరిస్థితి. ఈ దుందుడుకు చర్యల పై ఎన్నికల రోజున సాయంత్రం  సి.కె. నేతృత్వం కూడ నిరసన  ర్యాలి కూడ నిర్వహించారు. కాని చివరికి ఏమైంది. ముచ్చటగా సి.కె. మూడో సారి ఎం.ఎల్.ఏ అయ్యారు. ఇదీ కుజ గ్రహం యొక్క గొప్పదనం. అందుకే 2010 లో మీ భవిష్యత్తును కుజ గ్రహ స్థితిని పట్టి వివరించాలని నిర్ణయించాను

ఏప్రల్ 5 నుండి 26 వరకు సింహంలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
మేషం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
వృషభం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
మిథునం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
కర్కాటకం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
సింహం:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
కన్య:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
వృశ్చికం:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
దనస్సు:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
మకరం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
కుంభం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి
మీనం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం

ఏప్రల్ 26 నుండి జూలై 20 వరకు కన్యలో కుజ గ్రహ సంచారంవలన ద్వాదశ రాశులవారికి ఫలితాలు:
(ఇక్కడ ఇదివరకే ఉన్న శనితో కుజుడు కలవడం వలన మంచి గాని చెడ్డ గాని తీవ్ర స్థాయిలో జరుగుతాయి)
మేషం:
శతృజయం,రోగ నివర్తి,వ్యవహార జయం,రుణ విముక్తి,భూలాభం,సోదర వర్గం వలన లాభం
వృషభం:
కోపం,శ్రుంగ భంగం, పుత్ర నష్టం .కాని అనుకోని రీతిలో భూ లాభం,అదృష్ఠం వరించును
మిథునం:
దారిద్రియం,తల్లి,ఇల్లు,వాహణం,విథ్యా వగైరాల్లో చిక్కులు,చికాకులు,
కర్కాటకం:
ప్రయాణాల్లో అనుకూలత,దైర్య సాహసాలాతో లాభం, కాని సోధర హాని
సింహం:
నిష్ఠూర వాక్కు,దన నాశం,కుటుంభ కలహం,ఉష్ణ రోగాలు,కాని హఠాత్తుగా అనుకోని చోట నుండి లాభం
కన్య:
రక్తం,మంట సంభంద జబ్బులు, కోపం,ఆయుధాలు,అగ్ని,విద్యుత్ వలన హాని
తుల:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు మొరాయించటం ద్వారా దన నష్ఠం. సోదర వర్గంవలన వృధా వ్యయాలు
వృశ్చికం:
ఇందనాలు,విద్యుత్,విద్యుత్ పరికరాలు ద్వారా ,సోదర వర్గం ద్వారా దన లాభం. భూలాభం.శతృజయం.
దనస్సు:
కార్య జయం, అగ్ని,ఇందన,విధ్యుత్ ముఖ వృత్తి వ్యాపారాల్లో లాభం. భూ లాభం.అయితే కాస్త టెన్శన్ ఎక్కువే
మకరం:
దూర ప్రయాణాల్లో హాని, తండ్రి,తండ్రి తరపు భంధువులు,తండ్రి ఆస్తి ,పొదుపువల కష్ఠ నష్థాలు
కుంభం:
అపాయం,ఆపద,ఆయుధాలు,అగ్ని,విద్యుత్, శతృవులు,పోలీసు,మిలిటరి,రైల్వే ఉధ్యోగుల వలన పీడ
మీనం:
ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాలో కష్థ నష్ఠాలు. నాభి ప్రదేశమున నొప్పి

No comments:

Post a Comment