Sunday, April 25, 2010

ఏ జీవరాశుల్లోను లేని దురాచారం మానవుల్లో

అమ్మా అమ్మోరు తల్లి !

ఈ జగన్నాటకానికి నువ్వే కథ, స్క్ర్రీన్ ప్లే  దర్శకత్వం వహిస్తున్నావు కాబట్టి
నీకు వీరి కథ ఎలా ముగుస్తుందో తెలుసనుకుంటా..
నేనైతే ఒకింతవరకు ఊహించి తెలుసుకుని
వీరిలో ఎలాగన్నా కాస్త జాగరూకత కల్గించాలని
అరిచి గీ పెడుతూ వీరి దృష్ఠిలో పిచ్చి వాడ్ని అవుతున్నా
వీరేమో భవిష్య జ్నానం లేక
కేవలం అజ్నానంతో జ్నానుల్లా బిల్డప్ ఇస్తున్నారు
నేనేమో భవిష్య జ్నానంతో వీరిని మేలుకొలప చూసి
వీరి దృష్ఠిలో అజ్నానిగా మిగులుతున్నా.

ఏమిటో ఈ ట్విస్టు. ?
బళా నీ టేస్టు !

అమ్మా !
నువ్వేదో ఇందిరా గాంథి అంతటి చండ శాసనురాలివని
వీరందరిని కంటికి కనబడని సూత్రాలతో ఆడిస్తున్నావని
సూత్రీకరించుకున్నారు.

కాని సర్వ స్వతంత్రమయివైన నువ్వు  మమ్ము భానిసలుగా చూస్తావంటే
ఎలా నమ్మనే?

కేవలం లైంగికావసరాలార్థం పెళ్ళీళ్ళు చేసుకుంటున్నారు.
అదీ ఎప్పుడు?
 పురుషుల్లోని పుంసత్వం నశించాక
స్త్ర్రీలలో మెనోఫస్ మొదలయ్యాక

కుల మతాల బేధాలను దాటి మనుష్యులను ఏకం చెయ్యగల బంధం
స్త్ర్రీ పురుషుల సంబంధం..
ఆ బంధానికీ కుల మతాలతో సంబంధం  పెడుతున్నారే..

రిక్త హస్తంతో ఈ భువి పై కొచ్చి
రిక్త హతముతోనే వెళ్ళవలసిన వీరు
ఇక్కడి వనరులన్నింటిని
మూట కట్టి తమ వారసులకు కట్ట పెట్టాలని కంకణం కట్టుకుని
గోరీలు కడుతున్నారే భావితరాల ఉనికికి సైతం

నాడు ఏక కణ జీవితో మొదలైన జీవరాశుల ప్రస్తానం
చూస్తే అర్థమవుతుంది వీరి వింత ప్రవర్తనల సినేరియో

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్న రోజులు
కాలం,దూరం,అబధ్రత,ఆపద లేని అచంచల స్థితి
దాని గురించిన తియ్యటి స్మృతులు
సెల్ కాపియింగ్ ద్వారా ప్రాణానికి ప్రాణానికి
శరీరానికి శరీరానికి బదిలీ అయ్యాయి

మళ్ళీ ఏకం కావాలన్న ప్రేరణను కల్పింఛాయి.
పునరేకీకరణకు ఈ శరీరాలే అడ్డమన్న భ్రమతో
శరీరాలను రాల్చుకోవడానికి
చావడం  చంపడం.. అనే రెండు మార్గాలనే
ఎన్నుకున్నారు.

ధైర్యం చాలని వారు చావడం,చంపడం చేతగాని వారు
సెక్సును ఎన్నుకున్నారు.

సెక్సు అందుభాటులోలేని వారు సంపాదనను ఎన్నుకున్నారు
ఒకే శరీరం, ఒకే ప్రాణంగా ఉన్న స్థితిని పోగొట్టుకున్నామనుకోవడం
కేవలం తమ భ్రమని అర్థం చేసుకోలేక పోయారు.

అసంఖ్యాక సెల్ ఫోన్ తయారీ కర్మాగారాలున్నా, ఒక కర్మాగారం
 ఎన్ని మోడల్స్ తయారు చేసినా, ఎన్ని నెట్ వర్కులున్నా
అన్నీ అన్నీ పరస్పరం విలీనమైయుండగా లేనిది

జీవరాశులు ఎలా విడి పోతాయి. ముఖ్యంగా సూక్మ బుద్దిగల మానవుడు
ఎలా విడిపోతాడు.

కలవాలని ఆరాటం. అందుకే ఈ జీవన పోరాటం.
సెక్సును కూడ ఇందుకో మార్గంగా ఎన్నుకున్నాడు మానవుడు
శరీరాల నడుమే అఘాధం శరీరం గురించిన  ప్రజ్న పోతే
ఈ సువిశాల సృష్ఠితో అనుసందానం సుసాధ్యమైది.
పురుషునికి వీర్య స్కలన సమయాన ఎదురయ్యే బ్లాక్ అవుట్
ఓ బుల్లి మరణంలా

శరీరం గురించిన ప్రజ్నను ఒక్క క్షణమన్నా మరిపించి
ప్రకృతితో కరచాలనం చేయించింది .ఆ కాలాతీత స్థితిలో
అహం అంతరించి పోగా శరీరం గురించిన ప్రజ్న అదృశ్యం కాగా
మానవుడు రతి    పై ఆసక్తి పెంచుకున్నాడు..

దురదృష్ఠవంతురాలైన స్త్ర్ర్రీకి ఈ అవకాశం కూడ కరవైంది.
భావ ప్రాప్తి అన్నది కేవలం బంపర్ లాటరి అయ్యింది.
అందుకే ఆమె విలీనానికి మరో మార్గం ఎన్నుకుంది
అదే గర్భం దాల్చడం.

ఒకే శరీరంలో మరో ప్రాణాన్ని విలీనం చేసుకో గలగడం
ఈ ప్రకృతితో విలీనమైనంత సంతృప్తిని ఆమెకు కలిగించింది.
ఈ ఒక్క కారణం చేతే స్త్ర్రీ చేతగాని మొగుడ్ని సైతం భరిస్తూంది.

స్త్ర్రీ భావప్రాప్తి కొరకు పట్టు పట్టే స్థాయికొస్తే ఇక్కడి వివాహ వ్యవస్థే కుప్ప కూలి పోతుంది.

అప్పటికే స్థిర వాసం కారణంగా ఆస్తి ఏర్పడింది.
తన ఆస్తి తన వారసునికే లభించాలన్న
ఆతృత ఏర్పడింది.

స్త్రీ) యోణిని బంధించలేని చేతగాని
పురుష ప్రపంచం ఆమెనే  బంధించింది.
స్త్రీ) భానిసైంది కాబట్టి ఆమె ఎప్పటికైనా తిరిగపడే ప్రమాదం ఉంది కాబట్టి
పురుషులు ఆమెతో సహజీవనం చెయ్యలేక పోయారు.

పైగా రతిలో తాను భలహీణుడని తెలిసాక,
మరీ ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ అతన్ని వేదించడం మొదలు పెట్టింది.
ఈ దుస్తింతి రతికి ప్రయ్తామ్నాయం వెతికే పరిస్థిని తెచ్చి పెట్టింది
అదే సంపాదన, హింస, పదవి, పేరు ప్రఖ్యాతల పై కాంక్ష
ఈ చిక్కు ముడి మరీ జటిలమై

ఈ రోజు  ఏ అవివాహిత  పురుషుడైనా స్త్ర్రిని అనుమానంగానే చూడకలుతున్నాడు
ఎక్కడ ఈవ్ టీజింగ్ కేసు పెట్టిస్తుందోనని
మరి ఏ వివాహిత పురుషుడైనా భార్యను  అనుమానంగానే చూడకలుతున్నాడు
ఎక్కడ గృహ హింసా చట్టం క్రింద కేసు పెట్టిస్తుందోనని

ప్రకృతిలో ఏ జీవరాశుల్లోను లేని దురాచారం మానవుల్లో ఉంది
అదేమంటే పర లింగం వారినుండి  సెక్సుకన్నా అదనంగా మరేదో ఆశించటం.

మదపుటేనుగంటి మగతనం ఉప్పొంగుతూ కామంతో దహించి పోతున్న
ఏ పురుషుడన్నా స్త్ర్రీ వద్ద కట్నం ఆశించగలడా కేవలం రతి తప్పా?

ఆరోగ్యవంత శరీరం ఉండి, పండించుకోగల వయస్సు ఒయ్యారం ఉండి
ఏ స్త్ర్రీయన్నా పురుషుని వద్ద 54 ఇంచిల కలర్ టివి అడుగుతుందా దరిద్రంగా?

ఏమైందే వీరికి  ఎటు వెళ్ళి పోతున్నారే ప్రకృతి నుండి దూరంగా దూరంగా
మరీ ఘోరంగా

పుట్టుకతో వృద్దులై కట్నాలు, 54 ఇంచీల కలర్ టివిలతో వైవాహిక జీవితాలను ముడి పెట్టుకుని ఎటు పోతున్నారే ?

స్త్ర్రీలో మాతృత్వం పట్ల తపన లేదు ,  మాతృత్వం  లేనే లేదు.
పురుషుల్లో పుంసత్వం లేనే లేదు.
వీరెలా విలీనమవుతారు ప్రకృతితో
వీరెలా అనుసంథానమవుతారు ఇతర జీవరాశులతో
అందుకే చంపుతున్నారు,చచ్చి పోతున్నారు

వీరికెలా రుజువు చెయ్యను మీరందరు ఇప్పటికే ఏకమై ఉన్నారని
ఈ అనుసంథానాన్ని మీకు కనిపించకుండా చేసేది మీ అహమేనని

విర్కెలా వివరించను పునరేకీకరణకు మీ శరీరాలు అడ్డం కావని,
అందుకోసం చంపడం,చావడం వృధా అని

వీరికెలా విశదీకరించను శరీరాలను రాల్చుకున్నంత మాత్రాన
విలీనం కాలేరని...........

ఓం శక్తి

1 comment:

  1. చాలా బాగా రాసారండీ, బాగుంది :)

    ReplyDelete