డా. వై.ఎస్ మరణానంతరం ఆ బాధ తట్టుకోలేక మరణించిన కుటుంభాలను ఓదార్చటానికంటూ జగన్ చే పట్టిన ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఇంత ఆలశ్యంగా ప్రారంభించటం. వై.ఎస్. మరణించి వారం పది రోజుల్లో తమ కుటుంభ పెద్దను / ముఖ్యులను పోగొట్టుకున్న కుటుంభాలను ఓదార్చటానికి ఆరు నెలలనంతరం వెళ్ళటమే.
ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.
సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి
పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే
ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది. ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు
జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.
ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.
జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే. ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .
కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్తును భయిట విక్రయించుకునే వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.
ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం. ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.
ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.
No comments:
Post a Comment