ముఖ్యమంత్రి ఇటీవల పల్లె బాట పట్టారు. తన ప్రసంగంలో రాహుల్ దండకం అందుకున్నారు. పాపం కాంగ్రెస్ పార్టిలో ఎవరైనా సరే యజమానులను కీర్తించకుంటే వారి మనుగడే అసాధ్యమై తీరా వార్డు మెంబర్లుగా కూడ గెలవలేని వి.హనుమంతరావు వంటివారు దండకం అందుకుని, పూనకం వచ్చి ఊగి అదిష్థానానికి దగ్గ్రరై పోగలరు.
కాని రోశయ్య పైకి రాహుల్ ను కీర్తిస్తూనే అంతర్లీనంగా జగన్ ను విమర్శించారన్న సంగతిని అర్థం చేసుకోవడానికి బుర్రలతో పని లేదు. కిడ్నీలు చాలు మరి.
రాహుల్ కు పదవీ కాంక్ష లేదట (జగన్ కు ఉందని దీనర్థం) , రాహుల్ మొదట ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటానన్నారట (జగనైతే అలా అనడం లేదని దీనర్థం) , రాహుల్ ఎంతో ఓపికగా, నిరాఢంభరంగా దేశాఠన చేస్తున్నారట( జగన్ అలా చెయ్యడం లేదని దీనర్థం)
రోశయ్య ఈ చివరి దశలో సబ్ జూనియర్స్ జట్టులో చేరి ఎందుకిలా ఆవస్థలు పడుతున్నారో తెలీడం లేదు. రాహుల్ కి జగన్ కి మద్య కొన్ని వ్యత్యాసాలున్నాయి.
రాహుల్ అతీతుడు. పార్టిలోని సీనియర్ మోస్ట్ నుండి, జూనియర్ మోస్ట్ దాకా అందరికీ ఆమోదయోగ్యుడు. పి.ఎం కుర్చి పై ఎవరున్నా వారికి తెలుసు తాము కేవలం కర్చీఫ్ వంటి వారమని ఎప్పుడు క్రింద పారేస్తే తమ బతుకు చెత్త కుండెనని ,దాని పై ( చెత్తకుండి పై కాదు ముర్ర్రో పిఎం.కుర్చీ పై ) రాహుల్ కూర్చుంటాడని.
నోటిలో వేలేసుకున్న చిన్న పిల్లవాడ్ని పోతూ పోత్ తదుపరి పి.ఎం ఎవరంటే వాడు సైతం చెబుతాడు రాహులేనని.
కాని జగన్ విషయం అలా కాదు. తండ్రి ద్వారా ఎనలేని సంపద, పేరు ప్రఖ్యాతలు వారసత్వంగా లభించినట్టే శతృత్వాలు కూడ లభించాయి. జగన్ శతృవులు చాలా బలహీణులు. వారికి చేతనైందంతా అదిష్ఠానం చూట్టూ తిరగడం, చాడీలు చెప్పడం. వంగి వంగి దండాలు పెట్టడం. రాజీవ్, సోనియా,రాహుల్ నామస్మరణ చెయ్యడం.తప్పని సరి పరిస్థితిలో వై.ఎస్. కూడ ఈ పనికి మాలిన పనులు చేస్తూ వచ్చారు . లేదని,కాదని అనను. కాని ముసలి నక్కలకు చాన్స్ ఇవ్వ కూడదని రాష్ఠ్ర్ర ప్రజలకు తాను చేయాలనుకున్న వాటిని చెయ్యాలంటే మనుగడ కూడ ముఖ్యమని భావించి చేసినవవి.
పైగా అదిష్ఠానానికి అదిష్ఠానంగా వై.ఎస్. దర్శనమిచ్చారే గాని రోశయ్య లా ప్రేలవంగా మాత్రం కనపడలేదు. " అడుగ కూడనివి చెప్ప కూడనివి "దిల్లిలో ఎన్ని జరిగినా వై.ఎస్. వాటిని తమ గుండెల్లోనే దాచుకున్నారు.ఇలా తన పరువును, అదిష్ఠానం పరువును కాపాడుకుంటూ వెళ్ళారు.
జగన్ కు, రాహుల్ కు మద్య పోలీకేమిటి అన్ని అదిష్ఠానం పాదాలు నాకే వారు విరుచుకు పడొచ్చు. కాని నా ప్రశ్న ఒక్కటే ..
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమినుండి కమ్యూనిస్టులను దూరం చేసింది ఎవ్వరు? తద్వారా కూటమికి జరిగిన నష్ఠాన్ని పూడ్చింది ఎవ్వరు? కమ్యూనిస్టులను దూరం చేసింది అదిష్థానం. అణు ఒప్పందం చేసుకోమని వై.ఎస్. ప్రభోధించ లేదే..
మహా కూటమికి కాంగ్రెస్ పార్టిలకి వచ్చిన ఓట్ల మద్య తేడా కేవలం ఒక్క శాతమే. జగన్ ప్రారంభించిన సాక్షి దిన పత్రిక, సాక్షి టి.వి లే లేకుంటే ఇక్కడి మీడియా దెబ్బకి కాంగ్రెస్ పార్టి అభ్యర్దులకు డెపాజిట్ సైతం లభించి ఉండదు.
రాహుల్ తండ్రి రాజీవ్ గాంథి కాంగ్రెస్ పార్టిని భూస్థాపితం చేసిన వ్యక్తి. జగన్ తండ్రి వై.ఎస్. ఆ పార్టికి పూర్వ వైభవం తెచ్చి పెట్టిన వ్యక్తి. సోనియా అమ్మవారికి అఖిల భారత అర్చకులు వండి తెచ్చి పెట్టిన ప్రసాదాలను ఆరగించటం ఆరగించక పోవడం, వాయిదా వేసుకోవడం రాహుల్ గొప్పతనమేమి కాదు. అతనికి పి.ఎం. పదవి అన్నది ఎవరో ఆవులు పెంచి, పితికి , పిండి, తెచ్చి గ్లాసులో ఇచ్చిన పాలువంటిది. కాని జగన్ అలా కాదు. 2009 ఎన్నికల్లో వై.ఎస్. కు తోడుగా నిలచి యుద్దం సలపిన విర కుమారుడు. వై.ఎస్. చేతికి కాలమిచ్చిన గ్లాసెడు పాలు కాలం చేతనే నేలపాలైతే జగన్ శ్రీ కృష్ణావతారం ఎత్తవలసి ఉంది. పశువ్ల కాపరి కావల్సి ఉంది.
చేతిలోని పాల గ్లాసును నోటిదాక తీసుకెళ్ళటానికి నిమిషాలు చాలు అందుకే రాహుల్ ఓపికగా ఉన్నారు.
జగన్ పరిస్థితి అలా లేదు.. దినిని రోశయ్య అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది. వై.ఎస్. హయాంలో ఫైనాన్స్ మినిస్టరుగా రోశయ్య పేరు ప్రఖ్యాతలు పరమోచ్చానికి వెళ్ళాయి. వై.ఎస్.కుమారుని హయాంలో అది కాస్తా అత: పాతాళానికి వెళ్ళి పోకుండా రోశయ్య జాగ్రత్త పడితే మంచిది.
No comments:
Post a Comment