Monday, June 7, 2010

కాంగ్రెస్ పార్టి గుర్తింపును రద్దు చెయ్యాలి

దేశంలోని రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి , ఎలా నడుచుకోవాలి, ఎటువంటి నిభంధనలను పాటించాలన్న అంశాలు మన రాజ్యాంగంలోనే ఉన్నవి. వీటిని  సదరు పార్టీలు ఎంత మెరకు పాటిస్తున్నాయో పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది.

రాజకీయ పార్టీలు  రాజ్యాంగానికి లోబడే వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే దేశంలో  అమల్లో ఉన్న   లా వేరు  పార్టీలు అంతర్గతంగా  ఏర్పాటు చేసుకున్న బైలా వేరు.

బైలా అన్నది లా కు లోబడి ఉండవలసిందే . ఏ సంస్థైనా సరే  సదరు సంస్థ ఏర్పాటు చేసుకున్న బైలా  దేశంలో అమల్లో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించేలా ఉంటే   ప్రభుత్వం  సదరు బై లాను వెంటనే తొలగించవచ్చు. అందుకు సదరు సంస్థ సిద్దంగా లేకుంటే ఆ సంస్థనే రద్దు చెయ్యొచ్చు.

ప్రజలు ఎన్నికల్లో  ఎంపిక చేసిన మెజారిటి శాసన సభ్యులు ఎవరిని తమ నేతగా ఎన్నుకుంటే వారే రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రిగా ఉండాలని రాజ్యాంగం చెబుతూంది. కాని అదిష్ఠానం ఎవరిని సూచిస్తే వారినే శాసన సభ్యులు నేతగా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని కాంగ్రెస్ పార్టి సాంప్రదాయం , వివిద రాష్ఠ్ర్రాల్లో కాంగ్రెస్ పార్టి అవలంభించిన తీరు చెబుతూంది.

ఇదివరకే చెప్పినట్టుగా లా X బై లా మద్యన తేడా వచ్చినప్పుడు లా మాత్రమే అంతిమం.  వై.ఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టి శాసన సభా పక్షం వై.ఎస్. జగన్ ను తమ నేతగా పేరొంటూ ఉత్తరాలు పంపింది. కాని  అదిష్ఠాణం తానున్న దిక్కుకేసి వంగి వంగి దండాలు పెట్టే రోశయ్యను  రాష్ఠ్రం పై రుద్దింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఎన్నికల కమిషన్ తనకు తానై జోక్యం చేసుకుని వివరణ కోరవచ్చు. చర్యలు తీసుకోవచ్చు. కాని తీసుకోలేదెందుకు?

ఇది మన రాజ్యాంగంలోని లోపం.

అలాగే  రాజకీయ పార్టీలు క్రమం తప్పకుండా  అంతర్గత ప్రజాస్వామ్య పరిరక్షణకై పార్టిలో  ఎన్నకలు  నిర్వహించ వలసి ఉంది. ఏమాత్రం అంతర్గత ప్రజా స్వామ్యం  లేని కాంగ్రెస్ పార్టి గుర్తింపును  ఈ ఒక్క అంశం ఆధారంగానే  ఎన్నికల కమిషన్ రద్దు చెయ్యొచ్చు. ఆ దమ్ము దైర్యం ఎన్నికల కమిషనుకు ఏది?

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన:
ఇంతే కాదు భారత రాజ్యాంగం పౌరులు దేశ వ్యాప్తంగా తాము కోరిన చోట పర్యటించ వచ్చని. తమ భావాన్ని. ప్రకటించుకోవచ్చని చెబుతూంది. కాని జగన్ విషయంలో జరిగిందేమి? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?

మహబూబా బాద్ రైల్వేస్టేషన్లో జగన్ వర్గానికి చెందిన ప్రజా ప్ర్రతినిదులను మట్టు పెట్టడానికి కుట్ర జరిగింది. రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన జీవించే హక్కును కాల రాయడం కాదా?

నెహృ,ఇందిరా,రాజీవ్ ,సోనియా రేపు రాహుల్ ఇలా ఎవరొచ్చినా ఎక్కడో చోట రాజ్యాంగ ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది.  ఇటువంటి అంశాలే చిలికి చిలికి గాలి వానై కాంగ్రెస్ పార్టిని అప్పుడప్పుడు ఇంటేన్సివ్ కేర్ యూనిట్ కు పంపుతూంది.

తప్పు చెయ్యడం తప్పు కాదు. తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోక పోవడమే తప్పు. ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చెయ్యడమే  తప్పు. మన తప్పును మనమే సరి దిద్దుకుంటే నష్ఠం తక్కువ. కాలం తన చేతిలో రెడ్ పెన్ తీసుకుని కరెక్షన్ మొదలు పెడితే గోవిందా .. గోవిందా

నాడు రాం జెత్మలాని బోఫర్స్ కుంభకోణం విషయంలో రాజీవ్ గాంథికి ప్రశ్నలు సంథిస్తే "మొరిగే కుక్కలకు సమాదానం చెప్పను" అన్నాడు రాజీవ్. దాని పర్యావసనంగా కాంగ్రెస్ పార్టి అధికారాన్ని పోగొట్టుకుంది.

వినాశ కాలే విపరిత భుద్ది అన్నాడు లోక్ నాయక్ జెయ ప్రకాష్ నారాయణ్. చరిత్ర పిచ్చిది. అది ఒకే విషయాన్నిమళ్ళీ మళ్ళీ వాగుతుంటుంది.

కాంగ్రెస్ పార్టి పై , యు.పి.ఏ ప్రభుత్వం పై ఎన్నో కత్తులు వేలాడుతున్నాయి. పెట్రోల్ ,డీజల్ దర పెంపు, త్రీ జి స్పెక్ట్ర్రం కుంభకోణం, తెలంగాణా..

ఒక పార్టి కనీశం రాజకీయ దృక్పథంతో నైనా అలోచించి తనకేది లబ్ధి చేకూరుతుందో కూడ తెలుసుకోకుంటే ఇంకేమనాలి. జగన్ తెలంగాణలో పర్యటించి ఆ పర్యటన విజయవంతమైయ్యుంటే ( పాలకుల కుట్రలు, పాలకుల ఆదేశానుసారం పోలీసుల శల్య సారథ్యం లేకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యుంటుంది. రేపు జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టికి లాభం జరిగుండేది.  కే.సి.ఆర్ ఒక నాటి భూతం. వై.ఎస్. ఎప్పుడో బాటిల్ లో భంధించారు. ఇప్పుడు సోనియా, రోశయ్యలు కే.సి.ఆర్ ని బాటిల్ నుండి విడుదల చేసేసారు. అయినా  పిల్ల దెయ్యం ఆట కట్టించటానికి ఈ ముసలి నక్కల వల్ల ఏమవుతుంది. 

కాలం తన తీర్పునిచ్చినప్పుడు దృశ్యం మారినప్పుడు వీరు రాజకీయ అనాథలుగా మిగిలి పోతారు. అది ఖాయం.

No comments:

Post a Comment