Saturday, June 5, 2010

జగన్ పై వేటు వేస్తే...........

శ్రీకాకుళం ఓదార్పు  యాత్రకు ఇప్పటికీ కట్తుబడి ఉన్న  జగన్ పై  ఆదిష్ఠానం వేటు వేస్తే...........జగన్ అందుకోవలసిన నినాదాలు:

1.తెలుగు ఆత్మ గౌరవం  మంట కలిసింది
2.కేంద్రంలో పార్టి బలహీణంగా ఉన్నప్పుడు విధి లేకే అప్పుడు తండ్రికి గౌరవామిచ్చారు. వారి అసలు స్వరూపం ఇదే
౩.ఏమాత్రం విశ్వసనీయత లేని కే.సి.ఆర్ ను ప్రోత్సహించి తెలుగు సైమైక్యతకు
గండీ కొట్టారు
4.అక్కడ తెలంగాణా వాది అయిన కే.సి.ఆర్ ను ,ఇక్కడ  సైక్య రాగం అందుకున్న చిరంజీవిని    బొమ్మలు చేసి ఆడించాలన్నదే, రాష్ఠ్ర్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నదే వారి ద్యేయం. ఈ పరిణామాన్ని కే.సి.ఆర్ ఖండించక పోవడమే ఇందుకు ఎవిడెన్స్
5. నాడు వై.ఎస్.ఆర్ రాష్ఠ్ర్ర్రాన్ని దోచి సోనియాకు పెడుతున్నారని చిరంజీవి ఆరోపించారు.నేడు చిరంజీవిని కలుపుకోవడంతో ఆ వాదనకు భలం చేకూరదా?
6. ఒక దివంగత నేత సతీమణి కీలక సమయంలో లేఖ పంపితే దాని పై స్పందించాల్సింది సోనియానా? సింఘ్వినా? ఇదేనా తెలుగు మహిళలకు దిల్లీవారిచ్చే గౌరవం?
7.వై.ఎస్. మరణానంతరం 150 పై చిలుకు ఎం.ఎల్.ఏలు నన్ను సి.ఎం చెయ్యాలని కోరితే తమ చెప్పు చేతల్లో ఉంటారని రోశయ్యను ఎంపిక చేసుకోవడం రాష్ఠ్ర్ర్రానికి, పార్టికి చేసిన ద్రోహం కాదా?
8.ఆదిష్ఠానం యొక్క ఈ అనుచిత  ప్రవర్తన చూసి తెలుగువారి  మనస్సులు ఆక్ర్రోశిస్తే నేను అదుపు చేసాను. ఈ దుస్థితిలో తెలుగుదేశం పార్టి తెలుగు వారి  ఆత్మ గౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళితే ఏమవుతుంది?
9.రాష్ఠ్ర్రాన్ని మానవీయ కోణంలో తెలుగు వారి హృదయాలకు దగ్గరగా పరిపాలన సాగించిన ఇద్దరు నేతలు ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్. వారిద్దరి వారసులకు అన్యయం జరిగింది. ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలను తుంగలో తొక్కిన వ్యక్తి చంద్ర బాబు. ఆ పథకాలను తు.చ తప్పకుండా అమలు చేసిన వ్యక్తిత్వం వై.ఎస్.ఆర్ ది .కాబట్టి ఎన్.టి.ఆర్ వారసులు, ఎన్.టి.ఆర్ అభిమానులు నన్ను భలపరచాలి.


ఇక కార్యాచరణ:
1.జగన్ ఎం.పి పదవికి, విజయలక్ష్మి ఎం.ఎల్.ఏ పదవికి రాజినామా చెయ్యకూడదు. అవి మా స్వంత భలంతో దక్కిన పదవులని ప్రకటించాలి. (రేపు ఓదార్పు యాత్రలోనైనా, స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనైనా ఈ పదవుల వలన కొన్ని అనుకూలత, రక్షణ ఉంటాయి.
2..స్థానిక ఎన్నికల్లో పోటి,విజయాలే ద్యేయంగా ప్లాన్ చేసుకోవాలి

౩.ఎం.పి., ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్సిల్లో ఎవరు కలిసొస్తే  వారందరిని వేరే గ్రూపుగా పని చేసేలా చూడాలి. గవర్నరు,రాష్ఠ్ర్ర్ర పతి, స్పీకర్ లకు ఉత్తరాలు అంద చెయ్యాలి

4.వెంటనే కొత్త పార్టి ( కాంగ్రెస్ వై.ఎస్.) ఏర్పాటు చేసుకోవాలి. ఓదార్పు యాత్రను ఏక బిగిన కొనసాగించి పూర్తి చెయ్యాలి. తెలంగాణ ప్రాంత యాత్రకు కోర్టుల ద్వార అనుమతి పొందాలి.

5.సాక్షి టివి, మరియు  దిన పత్రికలను ప్రొఫెష్నల్స్ చేత ప్రొఫెష్నల్ గా నడిపే ప్రయత్నం చెయ్యాలి. తఠస్తులు సైతం మొగ్గు చూపేలా వాటి కార్యక్రమాలు, వార్తలు  ఉండాలి

6.వీలును బట్టి ఓదార్పు యాత్రను పాద యాత్రగా మలుచుకున్నా బేషూగ్గా ఉంటుంది.

7.తెలంగాణా విషయంలో అక్కడి ప్రజలే తేల్చుకునేలా ఓటింగుకు డిమాండ్ చెయ్యాలి. అన్ని వర్గాల వారు ప్రచారం చేసుకునే వీలు కల్పించాలని డిమాండ్ చెయ్యాలి.

8.కొత్తగా పెట్టిన  పార్టి అధికారానికి వస్తే బి.సి కి ఉప ముఖ్యమంత్రి మరియు హోమ్ శాఖా కేటాయిస్తానని చెప్పాలి. స్త్ర్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తానని ప్రకటించాలి. మహిళా కోటాలో  అంతర్గత రిజర్వేషన్ అమలు చెయ్యాలి. టోటల్ గా బి.సి, ఎస్.సి,ఎస్.టి.మైనారిటి వారికి 52 శాతం సీట్లు కేటాయిస్తానని ప్రకటించాలి

9. పార్టిలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చెయ్యాలి. పార్టి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి

2 comments:

  1. fine..చూదం ఏమి చేస్తాడో

    ReplyDelete
  2. asalu soniani enduku adagali permission....aa MADAM garu cheparu RAJIV GANDHI lekunte YSR ledanta...asalu mannati elections lo YSR(GOD) lekunte kachitanga congress odipoyedi......JAGAN anna nuvu manchi vadivi neku manchi jaruguthundi..sonia ledu evaru ledu nuvu YATRA ki po anna..emaithundo chuskundam...

    ReplyDelete