నా సలహా మెరకు (?) తిరుమల పై భక్తులకు డ్రెస్ కోడ్ అమైలైందని చెప్పుకోవాలని కుతూహలంగా ఉన్నా ఎందుకో నామోషిగా అనిపిస్తుంది. నేను గతంలో తిరుమలా విజన్ 1900 పేరిట ఒక ప్రాజెక్టు రూపొందించి తి.తి.దే. ఈ ఓ గారికి పంపాను. ఈ విజన్ లోని ముఖ్యాంశాలనే తి.తి.దే ఇటీవల వాయిదాల్లో అమలు చేస్తూంది.
గతంలో ప్రోజెక్టును పంపినాక సం.దాకా ఈ విషయమై రిమైండర్లు కూడ పంపాను. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వారికి కూడ ఫిర్యాదు చేసాను. చివరి ప్రయత్నంగా మీరిలా నా పేరైనా ప్రస్తావించక అమలు చేస్తూ పోవడం బాగా లేదు. నా ప్రోజెక్టు వెనక్కు పంపండి అని కోరుతూ రూ.10 ఎం.ఓ కూడ పంపాను. స్పందనైతే శూన్యమే.
ఇటీవల శ్రీవారికి సంభంధించిన బంగారాన్ని ఎస్.బి.ఐ లో డెపాజిట్ చెయ్యడం కూడ నా విజన్ లో నేనెప్పుడో పేరొక్కన్నవే. బ్లాగు డాట్ కామ్ లో ఈ విజనును ఒక టపా రూపంలో కూడ భహిర్గతం చేసి ఉన్నాను. కాని భక్తులకు డ్రెస్ కోడ్ అమలు రాజమండ్రికి చెందిన ఒక భక్తుని అభ్యర్దన మెరకు చేపట్టినట్టు ఈ.ఓ ప్రకటించారు.
నా పేరు ప్రస్తావించనీ ప్రస్తావించక పోనీ..కనీశం విజన్ ను ఏక కాలంలో అమలు చేస్తే చాలు. విజన్ లోని అంశాలు సత్ఫలితాలొస్తాయి. విజన్ పూర్తి పాఠాన్ని చదవటానికి ఇక్కడ నొక్కండి.
ఈ ఈ.ఓలు ,చేర్మెన్లు నాకు ఓ లెక్క కాదు. రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునే నిల దీసినవాడ్ని. కాని ఈ విజన్ విషయంలో వచ్చిన చిక్కెల్లా ఏమిటంటే శ్రీవారు. శ్రీవారిని నేను ఏం చక్కా అర్థం చేసుకున్నవాడ్ని కనుక ఆయన ప్లాన్ ఏమో నాకు ఇట్టే అర్థమై పోతూ ఉంటుంది.
నేను పేరు,డబ్బు ఆశించి ఈ విజన్ రూపొందించ లేదు. శ్రీవారికి సమర్పించుకోవడానికి నా వద్ద డబ్బుల్లేవు. కనీశం నా మేథస్సునైనా తిరుమల పవిత్రత పరిరక్షణకు వినియోగిద్దామనే విజన్ రూపొందించాను. నిజం నిప్పులాంటిది. దానిని ఎంతో కాలం ఎవ్వరూ దాచి ఉంచ లేరు అదెప్పుడో ఒకప్పుడు భయిట పడుతుంది. అప్పుడు అందాక దానిని దాచి ఉంచాలనుకున్నవారి బ్రతుకులు గుగ్గి పాలు అవుతాయి.
No comments:
Post a Comment