Wednesday, April 7, 2010

ఎస్.బి.ఐ లో తి.తి.దే భంగారం - నా సలహా పాటింపు

మంగళవారం తి.తి.దే. పాలకమండలి సమావేశం ఒక కీలక నిర్ణ్యం తీసుకుంది. శ్రీవారికి వివిద రూపాల్లో అందే భంగారాన్ని ఎస్.బి.ఐ లో డిపాజిట్ చెయ్యాలని నిర్ణయించింది. ఇల చేస్తే సతరు బంగారం విలువ పై కొంత వడ్డి కూడ వస్తుంది. శ్రీవారి బంగారానికి పూర్తి బద్రత కలగడంతో పాటు , దేవస్థానాన్కి వడ్డీ రూపంగా ఆదాయం కలగడంతో పాటు  పరోక్షంగా సతరు బంగారం దేశాభివృద్దికి కూడ ఉపకరిస్తుంది.

ఇది తిరుమల విజన్ 1900  శీర్శికన నేను దేవస్థానం వారికి పంపిన సలహాల సముదాయంలో ఒక పాయింట్.

గతంలో తి.తి.దేవారు తమ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలు చేసినప్పుడే ఒక టపా వ్రాస్తూ నేను కన్సెల్టంట్ ని కానని నాకు ఫీజు చెల్లించనవసరం లేదని, కనీసం నాకు కృతజ్నతలు తెలుపుతూ ఒక్క ఉత్తరం ముక్క కూడ వ్రాయవలసిన అవసరం లేదని అంతా శ్రీవారితోనే మాట్లాడుకుంటానని పేర్కొన్నా. ఆ మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.

ముఖ్యంగా సతరు టపాలో నా తిరుమల విజన్ 1900  పూర్తి పాఠానికి సంబందించిన టపా తాలుకు లింక్ ఇచ్చాను దానిని క్లిక్ చేసి విజన్ ను చదవండి భవిష్యత్తులో అందులోని ఎన్నో అంశాలు అమలయ్యే అవకాశం ఉంది.

సతరు టపాయొక్క లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చెయ్యండి

No comments:

Post a Comment