Thursday, March 25, 2010

తమిళ బ్లాగ్లోకంలో మోస్ట్ పాపులరైన నా సీరియల్-2

ముఖేష్ తండ్రికి ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళుండేవారు.తమ్ముళ్ళ  ఉద్యోగాలు,తమ్ముళ్ళు,చెల్లెళ్ళ పెళ్ళీళ్ళు అన్ని చేసాడు. మనిషి నిజాయితీ పరుడు కాబట్టి జిల్లా నుండి జిల్లాలకే  బదిలీ అవుతుండేవాడు. భార్య ఏమో ఆ నాటి ఎస్.ఎస్.ఎల్.సి . గ్రామ పెద్ద కూతురు. టీచర్ ఉధ్యోగం వదులుకుని మరి పెళ్ళి చేసుకుని. కుచేలుని భార్యలా పిల్లలతో సతమతమౌతుండేది. కాని ముఖేష్ తండ్రి మాత్రం భార్యను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సరే తన సర్వీసు  చివరిభాగంలో స్వంత ఊరుకు బదిలి అయ్యి వచ్చాడు. కాని దురదృష్ఠ వసాస్తూ ముఖేష్ తల్లికి రొమ్ము పై  ట్యూమర్ రావడం అది క్యేన్సర్ అని తేలడం కొన్ని నెలలకే ఆమె చని పోవడం కూడ జరిగింది.

తన ఫ్రెండ్ + బస్సు ఓనరు ద్వారా మాయ మంచితనం తెలుసుకున్న ముఖేష్ తండ్రి" ఆ అమ్మాయి ! ఎందుకురా అలా ఒంటరిగా  గది తీసుకుని ఉండటం ? మన ఇంట్లో ఓ గది ఇద్దాం. ఇక్కడే ఉండమను అంటాడు.

మాయ రాకతో ఆ ఇంట మళ్ళి చిరునవ్వులు వెల్లి విరుస్తాయి.ముకేష్ తండ్రి గతంలో ఒక అమెచ్యూర్ ఫోటో గ్రాఫర్ అని తెలిసి ప్రోత్సహించి స్టుడియో పెట్టిస్తుంది. కాని తగిన ప్రచారం లేక పోవడంతో బిజినస్ కాస్త డల్ గానే ఉంటుంది. అప్పుడు కేవలం యాడ్స్ తొనే ఒక పత్రిక నడిపితే ఎలా ఉంటుందని సలహా ఇస్తుంది.

ఫ్రీ పేపరుగా యాడ్స్ ఫోర్ట్ నైట్లొ రిలీజై సక్సె అవుతుంది.స్వామి కార్యంతో స్వయం కార్యం కూడ పూర్తైనట్టు స్టుడియోకి మంచి ప్రచారం ఏర్పడి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇంతలో ముకేష్,మాయ పని చేసే బస్ ఓనరు బస్సులు అమ్మేస్తున్నానని చెబుతాడు. నీకెలాగో ఫీల్డ్ బాగా తెలిసి పోయింది. మీ నాన్నతో మాట్లాడి నువ్వే రన్ చెయ్యి అని చెబుతాడు.

ముకేష్ తండ్రి ఇదివరకే తమ ఇల్లు కొన దలచిన కనకరాజులుకు ఓకె చెబుతాడు. అతను అంతకు పూర్వం మాట్లాడుకున్నట్లే దుర్గా కలనిలో ఒక ఇల్లు రెజిస్టర్ చెయ్యించి క్యేష్ గా ఏడు లక్షలు ఇస్తాడు.

ముకేష్ తో పుట్టినవారు ముగ్గురు. ఇతను మూడో అతను.

No comments:

Post a Comment