Thursday, March 18, 2010
రానున్నది " జగన్" నామ సంవత్సరం
ఈ టపాలో జగన్ భవిష్యత్తును సంఖ్యా శాస్త్ర్ర ప్రకారం వివరిస్తాను. అందుకు ఉపోద్ఘాతంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్స్.
ఇది వరకు పలువురు ప్రముఖుల జాతకాలు అనలైజ్ చేసి విజయవంతంగా వారి భవిష్యత్తును సూచించిన వాడ్ని. ఇటీవల వై.ఎస్. జాతకం అనలైజ్ చేసి సీట్లు తగ్గొచ్చేమో గాని విజయం తథ్యం. ప్రజా రాజ్యానికి ఇరవై నుండి ముప్పై సేట్లే వస్తాయని చెప్పిన వాడ్ని. బ్లాగు డాట్ కాం /స్వామి7867లోను,ఆర్కుట్లోను ప్రస్ఫుటంగా చెప్పాను. నానా బూతులు తిట్టించుకున్నాను.
అంతకు పూర్వమైతే చంద్రబాబు గారి మూత్రం సైతం పెట్రోల్ లా వెలిగిపోతున్న కాలంలోనే వారి సతీమణికి బాబుగారు పదవీచ్యుతడువుతారు, ప్రాణగండం ఉందని వ్రాసినవాడ్ని అంతకు పూర్వం జయలలిత జాతకాన్ని అనలైజ్ చేసి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని వ్రాసా (2000 సం. డిసెంబరులో) . జ్యోతిష్యం ఫలించి జయ ముఖ్యమంత్రి అయ్యారు. 2001 జూన్ లో త్యాంక్స్ కార్డు కూడ పంపారు.
ఇటీవల మద్రాసులో జరిగిన జ్యోతిష్కుల మహానాడులో స్వామి నిత్యానందా జాతకం
అనలైజ్ చేసి ఎవరో 21 రోజుల్లో నిత్యానందా సమస్యలన్ని పరిష్కారమై పోతాయని చెప్పారట. ముందు దినం నేను నిత్యానందా జాతకం గణించి ఫలితం టైప్ చేసి తెచ్చాను. అందులో నేను వ్రాసుకున్నదేమిటంటే ఇతను అనుమానస్పద మృతికి గురవుతాడు. విష ప్రయోగం కూడ జరుగ వచ్చు అన్నదే.
కాని ఏమాత్రం జంక కుండా నేను తెచ్చిన ఐటం అలానే నా తమిళ బ్లాగులో పెట్టాను.
ఇవన్ని చెప్పడం గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నేను జ్యోతిష్కునిగా ఉన్నప్పటికి జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాను ఎవరు ఏం చెప్పినా వినను.జాతక చక్రంలోని గ్రహాలు ఏమి చెబితే అదే వింటాను. దానినే పది మందికి చెబుతాను. నేను చెప్పినప్పుడు తిక్క తిక్కగా అనిపిస్తాయి గాని అవి నిజమవుతాయని సూచించటానికే.
జగన్ పుట్టిన సమయం తెలీక పోవడంతో సంఖ్యా శాస్త్ర్రంలో నేను చేసిన కొన్ని అన్వేషణల ఆదారంగా జగన్ భవిష్యత్తును ఇక్కడ సూచిస్తున్నాను. జగన్ పుట్టిన తేది (వికి పీడియా ఆధారంగా) 21.12.1972. ప్రాణ సంఖ్య 3 ( పుట్టిన తేది 21, 2+1చేస్తే ఈ సంఖ్య వస్తుంది) , స్థూల సంఖ్య 7. ( పుట్టిన తేదిలోని అన్ని అంకెలను కూడి సింగిల్ నెంబరు చేస్తే వస్తుంది)
పుట్టిన తేదిలోని 2,1 అంకెలను చూడండి. ఇవి చంద్ర సూర్యులను సూచించే అంకెలు. ఇవి కలిసాయంటే అమావాశ్యని అర్థం కదా? అమావాశ్యలో పుట్టినవాడు దొరన్నా అవుతాడు, దొంగన్నా అవుతాడని ఒక నానుడుంది. ఇందులో నిజం లేక పోలేదు. చంద్రుడు మనోకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. మనస్సు ఆత్మతో విలీనమైతే మనిషి సాధించ లేనిదంటూ ఏమీ లేదు. అందుకే ఈ నానుడు వచ్చిందేమో. ఇంతకీ జగన్ కూడ మనస్సును,ఆత్మను లక్ష్యం పై ఇటువంటి ఏకాగ్రతతో లగ్నం చేయగల వాడేనని చెప్పొచ్చు.
ఇక 2+1=3 అవుతుంది. మూడో నెంబరు గురుగ్రహాన్ని సూచిస్తుంది. గురువుకు ఎన్నో కారకత్వాలున్నప్పటికి అపనింద మోయించడం ఇతని ప్రప్రధమ కారకత్వం. జగన్ మోసిన నిందలు అంతా ఇంతా కాదు. అయితే ఈ అంకె వర్ణనాతీతమైన దైవ శక్తిని ప్రసాదిస్తుంది. బహుసా ఆ దైవ శక్తే జగన్ సి.ఎం కాకుండా అడ్డుకుందేమో. లేకుంటే రోశయ్యకు అంటిన పెంటలన్ని జగన్ కు కూడ అంటుకుని ఉంటాయిగా.
రాజకీయ వ్యూహ రచన, ప్రజాబలం ఈ రెండింటిని ఇచ్చేది గురుగ్రహమే. ఈ గురుగ్రహం యొక్క బలం తోనే ఆయన ఎం.పి గా ఎన్నికయ్యారు. అయినా ఎందుకు ఆయన వ్యూహాలు బెడిసి కొట్టాయంటే స్థ్లూల సంఖ్యను చూడండి, అది కేతు గ్రహాన్ని సూచించే 7 వ అంకె అయ్యింది. ఈ అంకె పిల్లి కళ్ళవారిని, విదేశీయులను సూచిస్తుంది. గురువుకు కేతువు పగ ఉంది. కాబట్టే జగన్ వ్యూహాలు కొంత బెడిసి కొడుతున్నాయి.
కాని కన్వెర్టడ్ క్రిస్టియన్ కావడంతో ఈ దోషం ఎంతో కాలం బాధ పెట్టదు. త్వరలోనే రిలీఫ్ వస్తుంది. (ఇతర మతాలను సూచించే అంకె కేతు). పనిలో పనిగా ఏప్రల్ మూడో వారంలో తాను చేపట్టనున్న టూర్ లో భాగంగా కాణిపాకం వచ్చి ఒక రాత్రి బస చేసి వెళ్ళినా ఈ దోషం మరింత తగ్గే అవకాశం ఉంది.
ఈ ఏడవ అంకె ఎలా ఫార్మ్ అయ్యిందో చూడాలి మరి. 2+5 కలవడం చేత ఫార్మ్ అయ్యింది. రెండవ అంకె మనస్సును సూచిస్తుందని ఇప్పటికే చెప్పియున్నాను. అంతే కాక పెరిషబుల్ గూడ్స్ ను, కేవలం మానసిక సంతృప్తినిచ్చే విషయాలను సూచించే అంకె 2 . వార్తా పత్రిక కూడ ఈ కోవకు చెందిందే. సాక్షి దిన పత్రికను విజయవంతంగా నడుపుతుండటం అందరికి విదితమే. అంటే జగన్ కు చంద్ర బలం ఉన్నట్టే గా లెక్క.
5 అన్నది బుధుడి అంకె.ఇతను వ్యాపార కారకుడు. విథ్యా కారకుడు, కమ్యూనికేషన్ రంగానికి అధిపతి. మనస్సులో ఉన్న మాటను ఎవరి మనస్సు నొచ్చుకోని విదంగా చెప్పగలగడం ఒక్క బుధబలం కల వారికే చెల్లు. ( గోల్డెన్ తెలంగాణా వాదనను గుర్తుకు తెచ్చుకొండి)
Y.S.JAGAN MOHAN REDDY ఆనే పేరుకు న్యూమరాలజి ప్రకారం వేల్యూ కడితే 53 వస్తుంది. దీనిని సింగిల్ నెంబరు చేస్తే 8 వస్తుంది. ఐదు, మూడు అంకెల గురించి ఇది వరకే చెప్పుకున్నాం. ఈ రెంటిని (5+3) కూడితే వచ్చే ఎనిమిదో అంకె వ్యవసాయం, ఐరన్ ,స్టీల్,సిమెంట్ తదితర రంగాలను సూచిస్తుంది. ఈ రంగాల్లో కూద జగన్ బాగానే రానిస్తున్నారు కాబట్టి శని భలం కూడ ఉన్నట్టే భావించ వలసి ఉంది. ముఖ్యంగా 8 చని పోయిన పూర్వికులను కూడ సూచిస్తుంది. డా.వై.ఎస్. ఆత్మ కూడ జగన్ ఆశయ సాధనకు తోడ్పడటం సుసాధ్యమే.
ఈ గొప్పలన్ని చాలు. భవిష్యత్తు గురించి చెప్పవయ్యా అని చికాకు పడుతున్నారు. ఓకే పాయింటుకొస్తున్నా.ముందుగా నామ సంఖ్య గురించి ఒక్క విషయం ఇది 53 కావడంతో జగన్ తనకు 53 ఏళ్ళ వయస్సు పూర్తి కాక మునుపే అన్ని పదవులు అనుభవించేయాల్సి ఉంది
ప్రాణ సంఖ్యను పట్టి:
ఇతని ప్రాణ సంఖ్య 3. ప్రాణ సంఖ్య మూడుగా ఉన్నవారి జీవితం ఒక రౌండుకు మూడు సం.లు చొప్పున సాగుతుంటుంది. ఈ రౌండ్స్ లో 2,5,7,9,11 వ రౌండ్స్ విజయవంతంగా ఉంటాయి. ఇలా పన్నెండు రౌండ్స్ పూర్తయ్యాక ఒక పెద్ద రవుండ్ పూర్తయ్యి మళ్ళీ ఒక పెద్ద రవుండ్ మొదలవుతుంది. ఇందులోను 2,5,7,9,11 వ రౌండ్స్ బావుంటాయి. ఈ లెక్కన చూస్తే జగన్ కు 36 సం.ల వయస్సు పూర్తయ్యింది. అంటే ఒక పెద్ద రవుండ్ పూర్తయ్యి, మరో పెద్ద రౌండ్ ప్రారంభమైంది. ఇందులో మొదటి రౌండ్లో ఉన్నాడన్న మాట.
ఈ మొదటి రౌండ్ పవాదులు, స్థాన చలనాలతో కూడుకున్నదై ఉంటుంది. అంటే జగన్ 39 ఏళ్ళ వయస్సు పూర్తి చేసుకునేంత వరకు ఇదే వరస ఉండొచ్చనిపిస్తూంది. (ఆంటే2011,డిసెంబరు,21 వరకు) ఆ తరువాత మొదలయ్యే సెకండ్ రవుండ్ (మూడు సం.లవరకు యోగప్రదంగా ఉండె అవకాశం ఉంది)
స్థూల సంఖ్యను పట్టి:
స్థూల సంఖ్య ఏడైనప్పుడు జీవితాన్ని ఏడేసి సం.లకో రౌండు చొప్పున విభజించుకోవాలి. ఈ లెక్కన ప్రస్తుతం జగన్ 38 వ ఏట ఉన్నాడు. . దీనిని ఏడుతో భాగిస్తే ఐదొస్తుంది. అంటే ఐదో రౌండు పూర్తై ఆరవ రవుండ్లో ఉన్నాడన్న మాట. ఈ ఆరవ రౌండు శతృజయం, రుణవిముక్తి, రోగ నివర్తినివ్వాలి. ఈ ఏడు సం.లలొ తొలూత మూడున్నర సం.ల పాటు శతృవులు ఏర్పడతారు .తదుపరి మూడున్నర సం.లో వారందరు నాశనమవుతారు. ఈ లెక్కన చూస్తే కొన్ని నెలలవరకే ప్రత్యర్దుల ఆట సాగుతుందన్న మాట. తదుపరి మూడున్నర సం.ల కాలం జగనుకు ఎదురుండదని నా బావం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment