Friday, March 19, 2010

తమిళ బ్లాగ్లోకంలో మోస్ట్ పాపులరైన నా సీరియల్

నా తెలుగు బ్లాగు ఫెయిలియర్ ఆయిందన్న అక్కసుతో చెబుతాననుకోకండి. తమిళ బ్లాగ్లోకం చాలా చైతన్య వంతంగా ఉంది. ముప్పై ఆరు అగ్రగేటర్శ్ ఉన్నారు. ఎటువంటి ఆంక్షలు లేవు. సీనియర్ ,జూనియర్ అనే తేడాల్లేవు. ప్రతి ఒక్కరు ఎంతో స్వేచ్చగా తమ భావాలను వెలి బుచ్చుతున్నారు. ఇదివరకే చెప్పినట్టు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో లక్ష హిట్స్ సాధించానంటే చూసుకొండి. తమిలిష్ డాట్ కామ్ అనే సైట్ పాఠకుల ఓట్ల ప్రాతిపదికన ప్రతి రోజు ఒక పాపులర్ పోస్టును ఎంపిక చేసి మొదటి పేజిలో ఉంచి గౌరవిస్తూంది. నేను గత నెల మొదలు పెట్టిన నీకు 22 నాకు 32 సీరియల్ ఇప్పటికి చాలా సార్లు పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆ సీరియల్ కథా వస్తువేమిటో తెలుగు బ్లాగ్లోకానికి చేరవెయ్యాలని ఈటపా వ్రాస్తున్నాను.

కథ 1987లో ప్రారంభం అవుతుంది. ముఖేష్ వయస్సు 22. డిగ్రీ చదువులు పూర్తి చేసుకుని గాలికి తిరుగుతుంటాడు. అతని తండ్రి నిజాయితీ గల రిటైర్డ్ ప్రభుత్వ ఉధ్యోగి. తన ఫ్రెండు ఒకతను టూర్స్ అండ్ ట్రావల్స్ పెట్టుంటే అతనికి చెప్పి ముఖేష్ ను ఉధ్యోగంలో పెడతాడు. మనవాడు యంగ్ అండ్ ఎనర్జటిక్ కాబట్టి అతనికున్న రెండు టూర్ బస్సులు టైట్ షెడ్యూల్తో తిరిగేలా చేస్తాడు. అవుట్ డోర్ పనిలో చూపే ఆసక్తి క్లెరికల్ పనుల్లో చూపక పోవడంతో మనోడికి సాయంగా మాయా అనే 32 ఏళ్ళ యువతిని అప్పాయింట్ చేస్తాడు. ఇతని చురుకుదానం ఆమెకు, ఆమె మెచ్యూరిటి ఇతనికి నచ్చి ఒకరికొకరు దగ్గరవుతారు.

మాయకు నలుగురు అక్కలు. తండ్రి భూస్వామి. ఆ నలుగురికి పెళ్ళి చేసేసాడు. ఈవిడకు పెళ్ళి చెయ్యలేక అందుక్కావల్సిన సొమ్ము మాయ పేరిట ఫిక్సెడ్ గా వేసి ఉంచాడు. మాయను రెండో పెళ్ళాంగా చేసుకుంటే ఆ డబ్బులు కొట్టెయ్యొచ్చని ఇంటి అల్లుళ్ళు ఎత్తులేస్తే చికాకు కలిగి టౌన్ భాట పట్టింది మాయ.

ఇదిలా ఉంటే ఒక ఆదివారం మాయను కలవాలనిపించి ఆమె రూమ్ వెతుక్కుంటూ వెళ్తాడు ముఖేష్. తలుపులు బార్లా తెరిచి ఉండగా ఆమె ప్రక్కనే పురుగుల మందు. నోట నురుగు. నానా తంటాలు పడి ఆమెను రక్షిస్తాడు. భాగా కోలుకున్నాక ఎందుకా పని చేసావని చెంప చెళ్ళుమనిపిస్తాడు. అప్పుడామె తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది.

మా ఊరి ప్రెసిడెంటు గారి అబ్బాయి నరేష్. అతను కాలేజి రోజుల్లో నుంచి మాయను ప్రేమిస్తున్నాడు. మాయకు ఇంటరస్ట్ లేక పోయినా మాయకొచ్చె సంబంధాలన్ని చెడకొట్టే వాడు.మాయకు చికాకేసి పోని నన్నునువ్వన్నా చేసుకో అంటుంది. నా చెల్లెలు పెళ్ళి కావాలి.కాగానే చేసుకుంటానంటాడు. మాయ టౌన్ భాట పట్టడంతో కమ్యూనికేషన్స్ లేవు.

అతను మాయవద్దకు వచ్చాడు. చెల్లికి పెళ్ళికి కుదిరిందని కట్నం డబ్బులు సర్దడానికి తిరుగుతున్నానని చెప్పాడుట. మాయ " ఆ డబ్బు నేనిస్తా నన్నొదిలేయ్ అంటూ పోస్ట్ డేటడ్ చెక్కిచ్చింది.అతను" నీకంత తల తిక్కా ! నువ్వు నన్నుంచుకున్నావని నా మీద మోజుతో ఈ చెక్కిచ్చావని ఊళ్ళోకెళ్ళి చెబుతా ఈ జన్మలో నీకు పెళ్ళి కాకుండా చేస్తా "అని వెళ్ళి పోయాడట, దీంతో మనస్సు విరిగి ప్రురుగుల మందు తీసుకుంది మాయ.

ముఖేష్ టవున్లో చిన్న సైజు డానైన బాబు రెడ్డి సాయంతో పల్లెలో కెళ్ళి నరేష్ మీద దవుర్జన్యం చేస్తాడు. గ్రామస్తులు చెట్టుక్కట్టి కొడ్తారు. అప్పుడు బాబు రెడ్డి సన్నిహితుడొకరొచ్చి విడిపిస్తారు, చెక్కు వాపసు ఇప్పిస్తారు.

తన కోసం ముఖేష్ పడ్డ పాట్లకు మాయ కరిగి పోతుంది. కాస్త చనువుగా ఉండడం ప్రారంభిస్తుంది. చిన్న తమ్మునిలా, ఎదిగిన బిడ్దలా చూస్తుంది. ఇతగాడేమో ఇతనికి అలానే అనిపించినా పైకి తుంటరి మాటలు చెబుతుంటాడు.

ఇంతలో టూర్స్ అండ్ ట్రావల్స్ ఓనరు భార్యకు గర్భాశయ క్యేన్సరు వచ్చి మద్రాసు అపోలో వెళ్ళాల్సి వస్తుంది. ఓనరుకు తన తాలుకు భంధువులతో వ్యవహారాలుండటంతో మాయను సాయం చెయ్యమని కోరతాడు. ఇద్దరు ఓనరు భార్యతో మద్రాసు చేరుకుంటారు. మాయ అక్కడే ఉండి అన్ని సేవలు అందిస్తుంది. గర్భాశయం తొలగింపుతో గండం గట్టెక్కిన ఓనరు భార్య మాయ గురించి తన భర్తతో ఆకాశానికి పొగిడి చెబుతుంది. ఈ మాటలు ఓనరు ద్వారా ముఖేష్ తండ్రికి చేరుతుంది.

అతను భాగా కష్ఠపడి పైకొచ్చినవాడు. తండ్రి సోమరిగా,వితండవాదిగా ఉంటే తల్లి చేత పోషించ బడినవాడు. తనకి నలుగురు మగ పిల్లలే. (ముఖేష్ మూడో అతను). ఇటీవలే భార్యను పోగొట్టుకున్నవాడు.

(సశేషం)

No comments:

Post a Comment