Monday, March 8, 2010

డబ్బు ఎలాంటిదంటే.. MONEY SECRETS

1.డబ్బు రక్తం వంటిది . అది సమాజమనే శరీరమంతటా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. లెకుంటే క్రమేణా ఆ శరీరానికి /సమాజానికి పక్షవాతం వస్తుంది
2.డబ్బు ఎటువంటి మూర్ఖుడనైనా జ్నానిగా మార్చ గల సరస్వతి ఆకు
3.డబ్బు మూగవాడిని సైతం పలికించగలదు ,గృడ్డి వాడ్ని సైతం చూసేలా చేస్తుంది. అవిటి వాడ్ని సైతం క్లాప్స్ కొట్టేలా చేస్తుంది, కుంటివాడ్ని సైతం మనకేసి పరుగు తీసేలా చేస్తుంది
4.డబ్బు ఏ బాషస్తునికైన అర్థమయ్యే బాష
5. డబ్బు తేనె నిండిన పాత్ర వంటిది ..దాని ఎడ్జి (Edge) మీద  వాలి కొంత ఆరగిస్తే ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. దానిలోకి దూకితే రెక్కలు తడిసి అందులోనే మునిగి ఊపిరాడక చచ్చి పోతాం
6.డబ్బు ఆక్సిజన్ కన్నా గొప్పది. డబ్బుతో ఆక్సిజన్ న్ సైతం కొనగలం.
7.డబ్బుతో మానవుడు కాలం,దూరాన్ని గెలవగలగడం అతని అదృష్ఠం ..కొన్ని సార్లు గుండెలను కూడ గెలవకలగడం అతని దురదృష్ఠం
8.డబ్బు ........దాని అవసరంతో ప్రయత్నించేవానికి ఎండమావి. తీరిగ్గా ప్రయత్నించేవానికి సెలయేరు
9.డబ్బు పటిష్ఠమైన ఆత్మగౌరవం గల వస్తువు..కేవలం ఆహాన్ని సంతృప్తి కోసం ఖర్చు పెట్టే వానిని వీడి వెళ్ళి పోతుంది.
10.డబ్బు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తుంది. కాని దానిని పొందాలంటే బలి చేయవలసింది కూడ దానినే
11. డబ్బు జీవితాన్ని తేజోమయం చేసే దీపం. కొన్ని సందర్బాల్లో దానిని గుగ్గి పాలు చేసే అగ్ని కూడ అదే
12.డబ్బు బుల్లెట్ వంటిది. ట్రిగ్గర్ నొక్కాక బుల్లెట్ పై అధికారాన్ని పోగొట్టుకున్నట్టే డబ్బును వెచ్చించాక దానిపై అధికారం కోల్పోతాం. ప్రేలుతున్న తుపాకీకంటే గురిపెట్ట బడిన తుపాకీకె ఆజ్నాపించే అధికారం ఎక్కువ
13.డబ్బు భగవంతునికన్నా గొప్పది. ఎందుకంటే మానవుడు దేవుడ్ని కొనడానికి ప్రయత్నించేది ఆ డబ్బుతోనే
14.అప్పు చేస్తే దానికి చెల్లించవలసింది కేవలం వడ్డీ మాత్రమే కాదు. వెంకటేశుడే గాని కుభేరుని వద్ద అప్పు చేసే వడ్డీ చెల్లించే కమిట్ మెంట్ లేకుండా ఉండి ఉంటే మన చచ్చు కోరికలను సైతం వింటుండే వాడూ కాదు. కానుకలు స్వీకరింఛి నెరవేర్చేవాడూ కాదు
15.డబ్బు బోగి మంటలు వంటిది మరీ దగ్గరకెళ్తే కాలి పోతాం. మరీ దూరమైతే పేదరికపు చలి వనికిస్తుంది.
16.డబ్బు ఎంతటి కురూపినైనా అందగత్తగా నిలబెట్టగల బ్యూటిషియన్
17.డబ్బుంటే పరాయి మనుష్యులు సైతం దగ్గరవుతారేమో కాని, స్వంత మనుష్యులు దూరమవుతారు.
18.డబ్బు బుర్రతో ఆలోచించే తెలివిని ఇస్తుంది  హృదయంతో ఆలోచించే మానవత్వాన్ని సమాధి చేస్తుంది.
19.డబ్బు విచిత్రమైంది. అదున్నప్పుడు గాని,వస్తున్నప్పుడు గాని దాని ద్యాసే ఉండదు. దాని ద్యాస ఉన్నంత వరకు డబ్బే రాదు.
20.మనిషి ప్రతిదాన్నిమరణంతో  ముడేసి ఆలోచిస్తాడు.. చీకటి, ఒంటరితనం,తిరస్కారం, ఏకాంతం,అవమానం, పేదరికం, ఆకలి,వృద్ద్దాప్యం  ఇలా ఎన్నింటినో మరణ సమానంగా దలుస్తాడు. వీటిని గెలవడానికి  డబ్బు సాయం చేస్తుందని డబ్బును ప్రాణ సమానంగా చూస్తాడు. డబ్బు మరణం యొక్క చాయలతో చేసే యుద్దంలో సహకరిస్తుందేమో గాని ,మరణపు ఛాయలకు సైతం వెళ్ళ లేదు.

No comments:

Post a Comment