Thursday, March 25, 2010

ప్రేమించడం వేరు, పెళ్ళి చేసుకోవడం వేరు.

మిత్రమా!
ప్రేమించడం వేరు, పెళ్ళి చేసుకోవడం వేరు. ప్రేమ తియ్యగా ఉంటుంది. ఎందుకుంటే ప్రేమలో బాధ్యత ఉండదు.ప్రేమికులిద్దరు జల్సాగా తిరిగొద్దమాని భయలు దేరుతారు. అప్పుడు రౌడీలు వారి వెంట పడతారు అనుకొండి. అప్పుడా ప్రియుడు వరికి ఎదురు తిరుగుతాడనుకొండి. చస్తాడనుకొండి.ఈమె మాత్రం అదృష్ఠ వశాస్తు క్షేమంగా బతికి భయిట పడిందనుకొండి. అయినా ఆ ప్రియురాలికొచ్చిన నష్ఠమేమిలేదు. (మానసికంగా బాధ, గిల్టి ఉండవచ్చు గాక)  ఇదే సంఘఠణలో ప్రియుడ్ని తరిమివేసి ఆమెను ఆ రౌడీలు రేప్ చేసి పారేసారనుకొండి.ఇతనికొచ్చిన నష్ఠమేమి లేదు.(మానసికంగా బాధ, గిల్టి ఉండవచ్చు గాక) ఇదే ఒక భార్య ,భర్త భయిటకెళ్ళినప్పుడు ఇలా జరిగిందనుకొండి అప్పుడేం పరిస్థితి.

ఇదో కోణం. మరో కోణంలో ఆలోచించండి. ముకుంద్, వీణా ప్రేమించుకున్నారు. కొంత కాలానిక్ వీణకు అర్థమైంది. ముకుంద్ పనికి మాలినవాడని,సోమరి, చేదస్తపు మనిషి అని ఇలా రక రకాలుగా అర్థమై పోయిందనుకొండి. వీణా క్రమేణా ముకుంద్ తో దూరం పెంచేసి కట్ చేసి పారెయ్యవచ్చు. అదే జంటలో ముకుంద్ కి కొంత కాలాని అర్థమవుతుంది. వీణా రోగిష్ఠి అని, పిచ్చిదని,వారి కుటుంభమే వివాదస్పద కుటుంభమని తెలుస్తుంది. అప్పుదు ముకుంద్ క్రమేణా వీణతో  దూరం పెంచేసి కట్ చేసి పారెయ్యవచ్చు.

ఇవన్ని ఒక ఎత్తైతే సెక్స్ విషయంలో ఎదుటివారు అనర్హులని తేలితే  ఏం చెయ్యాలి?
పొరభాటుగా గర్భం దాల్చి ఉంటే ఏంచెయ్యాలి? ఇవన్ని వేరే కథ. మొత్తానికి ప్రేమకు పెళ్ళికి ఉండే తేడా ఏమిటో చూచాయిగా చెప్పడానికే ఈ వ్యాసం.

ప్రేమ తాత్కాలికం.పెళ్ళి నిరంతర భందాన్ని ఇస్తుంది. భంధం అన్న పదానికి ద్వందార్థాలున్నాయి సుమా! ఒకటేమో రిలేషన్ షిప్ మరొకటేమో కట్టి పెడెయ్యడం.
ఎటువంటివారిపై ప్రేమైనా సరే కొంత కాలానికే అది నీరశించి సన్నగిల్లి పోతుంది. ప్రేమ సజీవంగా ఉండాలంటే ఆ ప్రేమ పెళ్ళితో ఎండ్ అయ్యుండ కూడదు.

అందుకేనేమో ప్రేమించి విడకొట్టినవారు ఎప్పుడూ తాము పోగొట్టుకున్న ప్రియుడు,లేదా ప్రియురాలి గూర్చి మధన పడుతూ ఉంటారు. ఆ ప్రియుడు లేటెస్టుగా పెళ్ళాడిన తన భార్యతో ఎలా ఉన్నాడు, ఆ ప్రియురాలు లేటెస్టుగా పెళ్ళాడిన తన భర్తతో ఎలా ఉంది? చూస్తే  పెళ్ళీ అనంతరం కూడ కొనసాగే కొన్ని భ్రమలు పూర్తిగా తొలిగి పోతాయి.

ప్రేమతో ప్రియురాలి ఇంటి పేరు మారదు. కాని పెళ్ళితో ఇంటి పేరు మారుతుంది. ఆమెకేదన్నా అవమానం జరిగితే ఇంటి పరువు పోతుంది. ప్రేమతో వారసులు పుట్టరు. ఆమెకు ఎయిడ్స్ సైతం ఉన్నా నష్ఠం లేదు (క్యేండోమ్స్ వాడేట్లుంటే), కాని భార్యకు టి.బి ఉన్నా ఇబ్బందే..

No comments:

Post a Comment