Wednesday, March 10, 2010

మహిళా బిల్లుతో ఆమెకు ఒరిగేది శూన్యం

దినపత్రిక చడవడం ఓ నరకం
ఏ.పి.లో డజనుకు పైగా దినపత్రికలున్నప్పటికి ఏపత్రికా నిజాలను నిర్భ్హయంగా వెలుగులోకి తేవడం లేదు. నెల్లూరు మేయర్ అవినీతిని ఫోకస్ చేసే పత్రికకు ఆమె మీదే ఎందుకంత ఆసక్తి? అంటే ఇతర నగరాల మేయర్లందరు ఉత్తములనా? ఒక పత్రిక ఓబుళాపురం మైన్స్ మీద దృష్ఠి సారిస్తుంది. మరో పత్రిక ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ పొరభాటు దొర్లిందా అని భూతద్దం పెట్టుకుని మరి చూస్తుంది. ఏమిటో..దినపత్రికలంటే అవి నింగిలో ప్రింట్ అయ్యి ఆకాశంనుండి ఊడి పడలేవుగా.. వారికీ "కొన్ని" హద్దులుంటాయి కాదనను.

నేను మద్యతరగతి కుటుంభంలో పుట్టినవాడ్ని. నా కా నిప్పుకోడి బతుకులంటే పరమ చికాకు. ఎలాగూ భాగుపడి సంపన్నులం కాలేం కాబట్టి చేతగాని మ.త. బ్రతుకు కన్నా పేద బ్రతుకే బెటరనుకున్నవాడ్ని. ఎందుకంటే మ.తవారికన్నా పేద వర్గాల్లో హిప్పాక్రసి తక్కువ. ది.పత్రికలది కూడ అక్షరాల అదే మనస్తత్వం.  మహిళా బిల్లుకు అత్యంత ప్రాధన్యమిస్తారు. దాని వల్ల దళిత, బి.సి.మైనారిటి వర్గాలకు జరిగే నష్ఠం గురించి వీరికి అక్కర్లేదు.

ఏ రెడ్డి,నాయుడో తనకు బదులు తన భార్యను /సోదరిని ముందుంచి తన పబ్బం కడుక్కునే అవకాశాన్నిమహిళా బిల్లు కల్పిస్తుందేమో కాని నిజంగా  మహిళలకు ఒరిగేదేమి లేదు.

మహిళా పోలీస్ స్టేషన్లన్నారు. మహిళలే ఉంటారు కాబట్టి మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎంత కాదన్నా ఇక్కడి సామాజిక  జీవితం పుంసత్వంతో కూడుకున్నది. ఇది పురుషుల ప్రపంచం. ఇక్కడ మహిళ రానివ్వాలంటే ఆమె పురుషునిగా మారాలి. మహిళా ఎస్.ఐలు చాలా మంది మారారు. ప్రస్తుతం మహిళా స్టేషన్లకు వెళ్ళాలంటే మహిళలే కాదు పురుషులు సైతం జంకే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహిళ పురుష ప్రపంచంలోకి అడుగు పెట్టగానే కొన్నాళ్ళకే ఆమె తనలోని సునితత్వం,మాతృత్వం ఆమె పురోగతికి అడ్డంకిగా ఉండటాన్ని గుర్తించి తను మారి పోతుంది.

దళితుల వ్యవహారంలోను ఇదే జరుగుతుంది. ఒక దళిత నేత తనను   పదవి వరించేంత వరకు ఎంతో రూడ్ గా, రేష్ గా, పోరాట పటిమతోనె ఉంటాడు. పదవి వచ్చిన తరువాత అతను రూలింగ్ క్లాస్ తో ( కులపరమైన, అధికార పరమైన) మింగిల్ కాలేక సతమతవుతాడు. చివరికి వారిలాగే తనూ మారతాడు. లేకుంటే అందులో ఇమడ లేడు.

మహిళలకు ౩౩ శాతం ఏం ఖర్మ జనాభాలో 50శాతం ఉన్నారు కాబట్టి యాబై శాతం ఇచ్చినా నాకేమి అభ్యంతరం లేదు. కాని ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మహిళ మగ పురుగుల బినామిగా ప్రవేశించి అధికారాన్ని తన భర్తకో,తమ్మునికో,కొడుక్కో కట్ట పెట్ట కల్గుతుంది కాని ఆమెకు ఒరిగేది ఏమి లేదు.

అంతటి ఇందిరమ్మ విషయంలోనే సంజయ్ గాంథి ఎంతటి ఓవర్ యాక్షన్ చేసాడు అందరికి విదితం. కాలం చెల్లిన, కుళ్ళి పోయిన,దగుల్ బాజి వ్యవస్థ లోనికి మహిళను నెట్టడం.. మరీ మరో మగ పురుగు బినామిగా నెట్టడం వ్యక్తిగతంగా ఆమెకు, రాజకీయంగా ఆ పార్టికి,దేశానికి సైతం ఏమాత్రం ప్రయోజనం చే కూర్చదు.

మహిళ మహిళే. ఆమె ఎస్.పి అయినా, మిలిటరి కమాండర్ అయినా ,మంత్రి అయినా చివరికి ప్రధాన మంత్రి అయినా ఆమెను అన్ని విదాల  ఈ పురుష ప్రపంచం ఎక్స్ ప్లాయిట్ చేసుకుంటుంద్ కాని సర్వైవల్ కోసం ఆమెను సైతం ఒక మగ పురుగుగా మారేలా చేసి సమాజంలోని ఆకలిని దోపిడిని మరింత పెంచుతుంది కాని దీని ప్రభావంతో కొన్ని లక్షల మంది మహిళలు నాశనం అవుతారు కాని జరిగే మేలంటూ ఏమీ లేదు.

మరి జనాభాలో సగ భాగమై ఉన్న  మహిళ దుస్థితి ఇలాగే కొనసాగవల్సిందేనా అంటే నో నెవర్. మరి ఏం చెయ్యాలి ?

వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి. మహిళ తన సున్నితత్వాన్ని, మాతృత్వాన్ని పోగొట్టుకోకనే పురుష ప్రపంచంలో ఇమడ కలిగేలా వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి. అప్పుడు మహిళ  ప్రవేశం అన్ని విదాల ఉపకరిస్తుంది.

No comments:

Post a Comment