నవగ్రహ పీడనకు హేతుబద్ద పరిహారాలు అన్న ఈ శీర్షికను చూడగానే మీరు నవగ్రహాలు పీడిస్తాయా అని ప్రశ్నించే రకమైతే దయ చేసి తప్పుకొండి. కావాలంటే ,మీకు ఓపికే ఉంటే నవగ్రహాలు ఎలా పీడిస్తాయో తెలుసుకోవాలనుంటే ఇక్కడ నొక్కి కాస్త విషయ జ్నానంతో ఈ టపాకు రండి.
తక్కినవారికి నవగ్రహ పీడనంటే ఏమో ? అవి ఎలా పీడిస్తాయో తెలుసనుకుంటాను. ఇక మిగిలిన వారైన మీలో సైతం పరిహారాలు అనే మాట విన్నాము గాని ఇదేమిటి కొత్తగా హేతుబద్ద పరిహారాలు మరో ప్రశ్న తలెత్తవచ్చు.
మన జ్యోతిష్య గ్రంథాలుగాని,పండితులుగాని పేర్కొనే పరిహారాల్లో హేతుబద్దత పూర్తిగా లేదని చెప్పలేం. ఎంతో కొంత హేతుబద్దత, తర్కం ఉండ బట్టే కొద్దో గొప్పో ఈ పరిహారాలు నవగ్రహ బాధితులకు ఊరట కలిగిస్తున్నాయి.
కాని కాస్త లోతుగా ఆలోచిస్తే వాటిలోని డొల్లతనం భయిట పడుతుంది.
పండితులు తరచూ రెకమెండ్ చేసే పరిహారం యజ్నం. యజ్నం అంటే ఏమిటి? విలువైన వస్తువులను గుగ్గిపాలు చెయ్యడం.
అగ్నికి అధిపతి కుజుడు. మీరు మీకు కుజ గ్రహం చేత దోషం కలిగి ఉండి మీరు యజ్నం చేపడితే కొంత మెరకు యజ్నం అన్నది రెమిడి కావచ్చు. కాని యజ్నం నిర్వహించే బ్రాహ్మణులకు వేలాది రూపాయలు కానుకగా ఇస్తుంటారు. వారు గురు కారకత్వం కలిగిన వారు. మీరు గురు కారకత్వం కలిగిన బ్రాహ్మణులకు డబ్బులిస్తే కుజ దోషం ఎలా తగ్గుతుంది?
పోని అనవసరంగా విలువైన వస్తువులను గుగ్గిపాలు చేయడంలో తర్కం ఏమిటి?
కుజ గ్రహం రక్తానికి కారకత్వం వహించే గ్రహం. మీరు రక్తం ఇంకి పోయేలా కష్ఠపడి సంపాదించి ఉంటే గాని ఆ డబ్బులతో యజ్నం నిర్వాహించ లేరు. యజ్నం అంటే విలువైన వస్తువులను గుగ్గిపాలు చెయ్యడం అన్న మాట మరోసారి గుర్తుకు తెచ్చుకొండి.
ప్రపంచంలో ఉన్న వస్తువులు,రంగాలు,మనుష్యులు అందరిని తొమ్మిది గ్రూపులుగా విడ కొట్టి వాటి పై అధిపత్యాన్ని తొమ్మిది గ్రహాలకు విభజించి ఇచ్చాడు భగవంతుడు. అగ్నికి కుజ కారకత్వం ఉంది ఓకే. మరి యజ్నానికి వాడే వస్తువులన్ని కుజ కారకత్వం గలవేనా .. అన్న ప్రశ్నకూడ తలెత్తుతూంది.
పట్టు చీర: శుక్ర కారకత్వం గలది. సుగంధ ద్రవ్యాలు శుక్ర కారకత్వం గలవి కొబ్బరికాయ: చంద్ర చంద్ర కారకత్వం గలది. ఇలా మీరు తల పెట్టిన పరిహారం ప్రక్క ద్రోవ పడుతుంది. ఇలా కొండను త్రవ్వ్వి ఎలుకను పట్టే చందంగా కాకుండా సూటైన పరిహారాలు చెప్పలేమా? ఇలాంటి చుట్టు మార్గాల కంటే సూటైన రూటు, బెటర్ చాయిస్ మరొకటి లేదా? అని నేను ఆలోచించి 1989 నుండి నా క్లెయింట్స్ కు రెఫర్ చేస్తూ మంచి ఫలితాలు కూడ ఇచ్చినవాటినే ఇక్కడ పేర్కొంటాను.
ఉ: కుజ దోషం
కుజునికి అధిదేవత సుబ్రమణ్య స్వామి. సుబ్రమణ్య స్వామి ఆలయానికి కుజ కారకత్వం గల మండే వస్తువులు, ఇందనాలు, ఎలక్ట్ర్రానిక్స్ వస్తువులు డొనేట్ చెయ్యొచ్చుగా. ఒక క్రైస్తవుడనుకొండి అతను చర్చికి , ముస్లీం అనుకొండి అతను పై తెలిపిన వస్తువులను మసీదుకు,దర్గాకు బహుకరించ వచ్చు. ఒక వేళ ఇవన్ని మూడ నమ్మకాలనే క్లెయింట్ వస్తే ఏం చెయ్యాలి?
కుజ కారకత్వం లోని గ్రూపుకు చెందిన మనుష్యులకు కుజ కారకత్వం వహించే వస్తువులు ప్రెసెంట్ చెయ్యొచ్చుగా? ఉ. పోలీస్ ఫ్రెండుకి ఎలక్ట్ర్రానిక్స్ వస్తువులు ఇవ్వొచ్చు. లేదా శరీరం కాలిన వారికి, అవయవాలు నరక బడిన వారికి బహుకరించ వచ్చుగా వీరందరు కుజ కారకత్వం గలవారే.
రక్త దానం:
మీరు మీ రక్తం (కుజ కారకత్వం) ధార పోసి సంపాదించిన డబ్బుతో కొన్న కుజ కారకత్వం ఉన్న
వస్తువులను ఇలా భహుకరించడం కన్నా ఆ రక్తాన్నే దానం చెయ్యొచ్చుగా? కుజ దోషం అంటే ఏమిటి? శస్త్త) చికిత్సకు, ప్రమాదానికి గురికావడం.రక్త నాశం కావడం. ఎప్పుడు ,ఎక్కడ ,ఎలా జరుగుతుందో తలచి భెంగ పెట్టుకోవడం కన్నా మనమే ఒక ముహూర్తం నిర్ణయించుకుని సాఫీగా ఆసుపత్రికి వెళ్ళి రక్త దానం చెయ్యొచ్చుగా ?
ఇదండి హేతుబద్ద పరిహారాలకు ఉన్న తర్కం.
ఈ శ్రీర్షికన నేను రచించిన గ్రంథాన్ని మొదట రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ ప్రచురణకు ఎంపిక చేసారు.డి.టి.పి కూడ పూర్తైంది. కాని దీనిని సరి చూసి ఆమోధ ముద్ర వెయ్యవలసిన వారి ఆస్థాన సిద్దాంతి మృతి చెందడంతో ఈ ప్రయత్నం ఆగి పోయింది. కాని తమిళంలో ఆన్మీగం, రాజరిషి, జోదిడ భూమి వంటి పత్రికలు సీరియల్ గా ప్రచురించాయి. వెబ్ ప్రపంచంలో అనేక వెబ్ సైట్స్ ఈ సీరియల్ ను పచురించి తమ హిట్స్ పెంచుకోవడం జరిగింది.
No comments:
Post a Comment