మనిషికి ఎక్కువగా బాధ కల్పించేది ఆ క్షణం కలిగిన బాధ కాదు ..అది తనకు రావలసిన ,కలుగ వలసిన బాధ కాదని భావించటమే. కాని ఇది పొరభాటు. ఈ జన్మలో మనకు కలిగే బాధలన్ని ఒకప్పుడు మనం కోరుకున్నవే అంటే మీకు ఆశ్చర్యం కలుగ వచ్చు . కాని ఇది నిజం.
ఎవరో కొందరు పుణ్యాత్ములు మాత్రమే మోక్షం పొందుతారని మనం భావిస్తుంటాం. కాని నిజానికి ప్రతి ఆత్మ మోక్షానికేసి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఆ ప్రాసస్ ఎంత పొడవైనదంటే
కొన్ని వందల జన్మలు ఈ ప్రాసస్ సాగుతూనే ఉంటుంది. ఈ ప్రాసస్ కాస్త స్ఫీడ్ అప్ కావడం కోసం ఒక ఏర్పాటుంది. అదేమంటే ప్రతి ఆత్మ అంతకు పూర్వం తానున్న శరీరంనుండి విముక్తి పొందగానే ఆ ఆత్మకు గత జన్మల్లోని తన పాప,పుణ్యాలన్నీ గుర్తుకు వస్తాయి. గత జన్మల్లొ తన మోక్షానికి / ఆథ్యాత్మికాభివృద్దికి/ భాగవదాన్వేషణకు ఏ ఏ అంశాలైతే ఆడ్డుగా ఉన్నాయో వాటిని గుర్తించ కలుగుతుంది. పైగా తాను ఎప్పుడైన భగవంతుడ్ని మరిచి పోయే పరిస్థితి వస్తే దానిని గుర్తుకు తెచ్చేందేకు కొన్ని చేదు అనుభవాలను సైతం పొందు పరచుకుంటుంది. గత జన్మలో తన మోక్షానికి ఆడ్డుగా ఉన్న అంశాలు లేని జన్మను కోరుకుంటుంది. ఉదాహరణకు గత జన్మలు ఒకతను మాంచి అందగత్తెను భార్యగా పొంది ఆమె మీది మోజులో భగవంతుడ్ని మరిచి ఉంటే రానున్న జన్మలో కురూపి అయిన భార్యను పొందాలని ఆ ఆత్మ నిర్ణయించుకుంటుంది. తాను ఏరి,కోరి డిజైన్ చేసుకున్న జీవితాన్నిచ్చే గ్రహస్థితి వచ్చేంతవరకు వేచి ఉంటుంది. ఆ తరువాతే జన్మనెత్తుతుంది. కాని జన్మనెత్తి ఆ జీవితాన్ని గడిపేటప్పుడు మాత్రం అది తాను కోరుకున్న జీవితమే అని, ఆ జీవితాల్లో తానెదుర్కునే కష్ఠ నష్ఠాలు తాను కోరుకున్నవేనని గుర్తించలేకపొతుంది.
No comments:
Post a Comment