1.ఇంటి యజమాని: ఇదేంటి .. మా ఇల్లంతా దోచేసి వంటా వార్పు పుస్తకం ఇస్త్రున్నావు
దొంగ: నీ యబ్బా ఫ్రిడ్జిలో ఉన్న తిండి దరిద్రంగా ఉందేరా.. ఈ సారి ఈ పుస్తకం చూసి బాగా వండమను
2.ఇంటి యజమాని: ఏమండి దొంగ గారు.. ఇలానే నెలకో సారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి
దొంగ: ఇదేమయ్యా వింతగా ఉంది నీ రిక్వెసు..
ఇంటి యజమాని:నా భార్య భయంతో వనకడం చూస్తుంటే బలే ముచ్చటేస్తుందోయి. ఆమెను ఇలా చూడడం ఇదే మొదటి సారి
3.భర్త: ఇల్లంతా ఊడ్చుకు పోతుంటే ఆ దొంగ ఎదవతో ఏమిటే గుస గుసలు
భార్య: మన పక్కింటి పంకజం కొత్తగా నెక్లెస్ కొన్న సంగతి అతనికి చెప్పానండి
4.డాక్టర్: ఏమయ్యా.. నేను ప్రాణాలు రక్షించే డాక్టర్ని..
దొంగ: అప్ప చా అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పవయ్యా
5.లాయరు: ఏరా మా ఇంట్లోనే దొంగతనానికొచ్చావా.. నీ కథేంటో చూస్తా..
దొంగ: ముందు మంచి లాయరెవడన్నా దొరుకుతాడేమో చూడు
6.దొంగ: 1 అదేట్రా సెక్స్ యువ నటి నళినా ఇంటికైతే దొంగ తనానికి రానంటున్నావు
దొంగ :2 ఆమె నా మనస్సు దొంగిలిస్తే
7.జడ్జి: ఏమిటయ్యా ఆ బ్యాంకునుండి దోచిన సొమ్ము అదే బ్యాంకులో డిపాజిట్ చేసి మర్సటి దినమే విత్ డ్రా చేసావు ఎందుకని?
దొంగ: డబ్బు ఉంచడానికి అది సురక్షిత స్థానం కాదని కాస్త ఆలశ్యంగా స్పార్క్ అయ్యింది సార్
8.ఎస్.ఐ: ఏరా మా రైటర్ గారి లూనా దొంగిలించావు?
దొంగ: నాకు గీర్ బండి త్రోలడం రాదు సార్
9.ఎస్.ఐ: నా ఇంట్లోనే ఒకడు దొంగ తనం చేస్తాడా? ఎలాగన్నా వాడ్ని పట్టుకుని
ఏ.ఎస్.ఐ: మామూలు గుంజేస్తాం సార్
10.నగల దుకానం యజమాణి: ఏరా నా అంగట్లో దొంగిలిచ్చిన నగ నా అంగడికే తెచ్చి అమ్ముతావా?
దొంగ: నన్నేంచెయ్యమంటావయ్యా! నీ అంగడి సీల్ చూసి ఎవ్వడు కొనడం లేదు
No comments:
Post a Comment